కాందహార్‌లో పేలుడు.. నలుగురు మృతి

కాందహార్‌లో పేలుడు.. నలుగురు మృతి

ఆఫ్ఘనిస్థాన్‌లో గురువారం భారీ పేలుడు సంభవించింది. కాందహార్‌ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటనలో నలుగురు పౌరులు మృతిచెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. పంజావాయి జిల్లాలో గురువారం ఉదయం..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 13, 2020 | 5:15 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో గురువారం భారీ పేలుడు సంభవించింది. కాందహార్‌ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటనలో నలుగురు పౌరులు మృతిచెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. పంజావాయి జిల్లాలో గురువారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు మహిళలతో పాటుగా ఓ చిన్నారి కూడా ఉన్నారు. మరో నలుగురు పిల్లలు, ఓ మహిళతో పాటుగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు పాల్పడింది ఎవరన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

Read More :

రాజస్థాన్‌లో తాజాగా మరో 608 పాజిటివ్‌ కేసులు

“మహా” పోలీసులను వణికిపోస్తున్న కరోనా మహమ్మారి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu