మాజీ మంత్రిపై కూతురి ఫిర్యాదు, నిర్బంధం లో ఉంచి కొడుతున్నారని ఆవేదన, స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన తన తండ్రి తనను నిర్బంధంలో ఉంచి కొడుతున్నారని, వేధిస్తున్నారని ఆయన కుమార్తె ఢిల్లీ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది.

  • Updated On - 10:16 am, Wed, 30 December 20 Edited By: Pardhasaradhi Peri
మాజీ మంత్రిపై కూతురి ఫిర్యాదు, నిర్బంధం లో ఉంచి కొడుతున్నారని ఆవేదన, స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన తన తండ్రి తనను నిర్బంధంలో ఉంచి కొడుతున్నారని, వేధిస్తున్నారని ఆయన కుమార్తె ఢిల్లీ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఆయన మాజీ  మంత్రి కూడా ! లోగడ మాజీ సీఎం షీలా దీక్షిత్ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన ఈయన తన కూతురి పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడం పట్ల మహిళా కమిషన్ కూడా విచారాన్ని, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజ్ కుమార్ చౌహాన్ అనే ఈ వ్యక్తి తన హోదాను కూడా మరచి,  ఇలా వ్యవహరించడాన్ని తప్పు పట్టింది. 1999 లో తనకు వివాహమైందని, కానీ తన భర్త తనకు విడాకులీచ్చాడని అప్పటి నుంచే తాను తన తండ్రి వద్దే ఉంటున్నానని బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపింది.  ఇంటి నుంచి నన్ను కదలకుండా రోజూ నన్ను నా తండ్రి, సోదరుడు హింసిస్తున్నారని ఆమె పేర్కొంది. తనకు ఇద్దరు కూతుళ్ళనిఆమె వెల్లడించింది.ఈమె చిన్న కూతురు కూడా తన తల్లి పట్ల జరుగుతున్న దౌర్జన్యాన్ని వివరించింది. బాధితురాలికి ఆమె తండ్రి నుంచి విముక్తి కల్పించాలని, ఆమెకు రక్షణ నివ్వాలని మహిళా కమిషన్ పోలీసులను ఆదేశించింది.

నగరంలో ఈ విధమైన కేసు బయటపడటం ఇదే మొదటిసారి.