ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్రిక్తత.. అటవీశాఖ వర్సెస్ ఆదివాసీలు

కాగజ్‌నగర్ జిల్లా సార్సాల ఉదంతాన్ని మరువకముందే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలపాడులో ఇదే తరహా దాడి జరిగింది. వ్యవసాయం తమ హక్కు అంటున్న పోడు సాగుదారులు అటవీశాఖ అధికారులపై దాడులకు పాల్పడుతున్నారు. అర్థరాత్రి పోడు భూములను ట్రాక్టర్లతో దున్నుతున్నార్న సమాచారంతో అక్కడికి వెళ్లిన అటవీశాఖ అధికారులపై పోడు సాగుదారులు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో బీట్ ఆఫీసర్ భాస్కర్, సెక్షన్ ఆఫీసర్ నీలమయ్యకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అటవీశాఖ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా వుండగా […]

ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్రిక్తత.. అటవీశాఖ వర్సెస్ ఆదివాసీలు
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 02, 2019 | 5:30 PM

కాగజ్‌నగర్ జిల్లా సార్సాల ఉదంతాన్ని మరువకముందే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలపాడులో ఇదే తరహా దాడి జరిగింది. వ్యవసాయం తమ హక్కు అంటున్న పోడు సాగుదారులు అటవీశాఖ అధికారులపై దాడులకు పాల్పడుతున్నారు. అర్థరాత్రి పోడు భూములను ట్రాక్టర్లతో దున్నుతున్నార్న సమాచారంతో అక్కడికి వెళ్లిన అటవీశాఖ అధికారులపై పోడు సాగుదారులు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో బీట్ ఆఫీసర్ భాస్కర్, సెక్షన్ ఆఫీసర్ నీలమయ్యకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అటవీశాఖ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదిలా వుండగా మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం పరిధిలోని లోతువాగు వద్ద అధికారులు కందకాలు తీస్తుండగా అడ్డుకున్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు రాఘవపై కేసు నమోదైంది. డీఎఫ్వో సూచన మేరకు అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. అధికారులను బెదిరించిన కేసులో ఏ1గా వనమా రాఘవ, ఏ2గా వారితో పాటు మరో ఇద్దరి పై కూడా కేసు నమోదు చేశారు. తొలకరి వర్షాలు ప్రారంభం కావడంతో మొక్కలు నాటేందుకు అటవీశాఖ సిద్దమవుతుంటే, పోడు భూములను సాగు చేసుకునేందుకు ఆదివాసీలు రెడీ అవుతున్నారు. మొత్తానికి అటవీశాఖ వర్సెస్ ఆదివాసీల మధ్య వార్ నడుస్తోంది.