నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో విచిత్ర ఘటన…అటవీ శాఖ కార్యాలయాలను సీజ్‌ చేశారు మునిసిపల్‌ అధికారులు

నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పన్నులు చెల్లించలేదని అటవీ శాఖ కార్యాలయాలను సీజ్‌ చేశారు మునిసిపల్‌ అధికారులు.

నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో విచిత్ర ఘటన...అటవీ శాఖ కార్యాలయాలను సీజ్‌ చేశారు మునిసిపల్‌ అధికారులు
Follow us

|

Updated on: Dec 22, 2020 | 2:14 PM

నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పన్నులు చెల్లించలేదని అటవీ శాఖ కార్యాలయాలను సీజ్‌ చేశారు మునిసిపల్‌ అధికారులు. ఏకంగా ప్రభుత్వ కార్యాలయాలనే సీజ్‌ చేయడం ఖానాపూర్‌లో చర్చనీయాంశంగా మారింది. ఖానాపూర్‌ అటవీశాఖ కార్యాలయాలకు సంబంధించి 1లక్షా 93 వేల 161 పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంది. అయితే గతంలో పన్నులు చెల్లించాలని మునిసిపల్‌ అధికారులు.. అటవీశాఖ సిబ్బందికి నోటీసులు ఇవ్వగా ఇటీవలే 50వేలు చెల్లించారు. మిగతా మొత్తాన్ని చెల్లించాలని కోరగా.. చెల్లించలేదు. దీంతో మునిసిపల్‌ కమిషనర్‌ తోట గంగాధర్‌ ఆధ్వర్యంలో అధికారులు అటవీశాఖ కార్యాయాలను సీజ్‌ చేశారు.

ఎఫ్‌డీవో, ఎఫ్‌ఆర్‌వో కార్యాలయాలతో పాటు అటవీ శాఖ గెస్ట్‌హౌస్‌ను సైతం సీజ్‌ చేశారు. ఖానాపూర్‌ అటవీ కార్యాలయాలకు సంబంధించి 1లక్షా 43వేల 161 చెల్లించాల్సి ఉండడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో అటవీశాఖ కార్యాలయాలను సీజ్‌ చేసినట్లు మునిసిపల్‌ కమిషనర్ తెలిపారు. దీంతో.. అటవీ సిబ్బంది ఆరు బయటనే కూర్చుని విధులు నిర్వర్తించారు. కాగా, తాము ఇటీవలే, 50వేల పన్ను చెల్లించామని.. అయినప్పటికీ మునిసిపల్‌ అధికారులు కార్యాలయాలను సీజ్‌ చేయడం సరికాదన్నారు డీఎఫ్‌వో కార్యాలయ సూపరింటెండెంట్‌. జరిగిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

Also Read :

కరోనా సమయంలోనూ భారీ కానుకలు..అన్నవరం సత్యదేవుని దేవస్థాన కార్తిక మాస ఆదాయం ఎంతో తెలుసా..?

Lpg Gas Price: కీలక నిర్ణయం దిశగా ఆయిల్ కంపెనీలు..ఇకపై ప్రతి వారం మారనున్న సిలిండర్ ధర !