మాస్క్ ధరించమన్నందుకు ‘గన్’‌ గురి పెట్టాడు

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు, కరోనా సోకకుండా ఉండేందుకు మాస్క్ ధరించాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తూనే ఉంది.

మాస్క్ ధరించమన్నందుకు 'గన్'‌ గురి పెట్టాడు
Follow us

| Edited By:

Updated on: Jul 24, 2020 | 5:22 PM

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు, కరోనా సోకకుండా ఉండేందుకు మాస్క్ ధరించాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తూనే ఉంది. ఈ క్రమంలో దాదాపుగా అన్ని దేశాలు మాస్క్‌ను తప్పనిసరి చేశాయి. కొన్ని దేశాలైతే ఇంకాస్త ముందడుగు వేసి మాస్క్ లేకపోతే ఫైన్లను వేస్తోంది. అయితే ఎంత అవేర్‌నెస్‌ చేసినా కొందరు మాత్రం మారడం లేదు. మాస్క్‌ను ధరించడం పెద్ద ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఎవరైనా మాస్క్ ధరించు అని చెప్పడం కూడా తప్పైపోతోంది. చెప్పిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా అమెరికాలోనూ అలాంటి ఘటనే చోటుచేసుకుంది. మాస్క్‌ ధరించిమని అడిగినందుకు ఫ్లోరిడాలోని వాల్డ్‌మార్డ్‌ స్టోర్‌లో తోటి షాపర్‌కి గన్ గురి పెట్టాడు విన్సెంట్ స్కావెట్టా అనే వ్యక్తి. షాపర్ కుమార్తెను కూడా ఈ సందర్భంగా విన్సెంట్ బెదిరించాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి పీబీసీ జైలుకి తలరించారు.

జైలులోకి అతడి రాకపై స్పందించిన పీబీసీ జైలు ఆఫీస్‌.. ”పీబీసీ జైలులోకి నీకు స్వాగతం. ఇది నీకో గుణపాఠంగా మిగులుతుంది. చివరకు చాలా ఇబ్బందిగా ముగుస్తుంది” అని కామెంట్‌ పెట్టారు. కాగా అమెరికాలో మాస్క్‌ ధరించేందుకు చాలా మంది విముఖత వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. మొన్నటివరకు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం మాస్క్ ధరించలేదు. అయితే ఇటీవల కాలంలో పంథా మార్చుకున్న ట్రంప్‌.. మాస్క్‌తో కనిపిస్తున్నారు.

మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే