రాజమండ్రిలో 5 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు, రంగంలోకి దిగిన పోలీసులు, కిడ్నాపర్ కోసం గాలింపు

తూర్పుగోదావరిజిల్లా రాజమండ్రిలో చిన్నారి కిడ్నాప్ ఉదంతం కలకలం రేపుతోంది. 5 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. ఇన్నీసుపేటలోని..

  • Venkata Narayana
  • Publish Date - 10:26 pm, Sat, 2 January 21
రాజమండ్రిలో 5 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు, రంగంలోకి దిగిన పోలీసులు, కిడ్నాపర్ కోసం గాలింపు

తూర్పుగోదావరిజిల్లా రాజమండ్రిలో చిన్నారి కిడ్నాప్ ఉదంతం కలకలం రేపుతోంది. 5 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. ఇన్నీసుపేటలోని దుర్గమ్మ గుడి వీధిలోకి యాక్టీవాపై వచ్చిన ఒక దుండుగుడు.. ఇంటి దగ్గర ఆడుకున్న బాలికకు చిప్స్ ప్యాకెట్ కొనిస్తామంటూ తీసుకెళ్లిపోయాడు. బాలిక కనిపించకపోవడంతో.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు. రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ కోసం గాలిస్తున్నారు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.