అస‌దుద్దీన్‌ను కలిసిన కొత్త ఎమ్మెల్యేలు..

అస‌దుద్దీన్‌ను కలిసిన కొత్త ఎమ్మెల్యేలు..

అత్యంత కీలకమైన, రాజకీయంగా ప్రాధాన్యత గల సీమాంచల్ ప్రాంతంలో అయిదు అసెంబ్లీ సీట్లను ఎంఐఎం తన ఖాతాలో వేసుకోగలిగింది. కిషన్ గంజ్ సిట్టింగ్ స్థానాన్ని పోగొట్టుకున్నప్పటికీ.. దానికి నష్టపరిహారంగా అయిదు స్థానాలను దక్కించుకోగలిగింది.

Sanjay Kasula

|

Nov 12, 2020 | 2:18 PM

బీహార్ ఎన్నిక‌ల్లో మ‌జ్లీస్ పార్టీ తన నెంబర్ పెంచుకుంది. గత ఎన్నికల్లో ఒకే ఒక స్థానాన్నిదక్కించుకున్న ఎంఐఎం.. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఐదు స్థానాల్లో విజ‌యం సాధించింది. అంతేకుండా అక్కడి అధికార, ప్రతిపక్ష పార్టీల విజయావకాశాలను దెబ్బతీసింది. అక్కడ కొత్త‌గా ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీని గురువారం క‌లిశారు. మూడు విడుత‌ల్లో జ‌రిగిన ఈ ఎన్నిక‌ల్లో మ‌జ్లీస్ పార్టీ 28 స్థానాల్లో ఎంఐఎం పోటీచేసింది.

ఇందులో అమౌర్‌, కొచ్చాదామ‌మ్‌, జోకిహట్‌, బైసీ, బ‌హ‌దూర్‌గంజ్‌ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపొందింది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక్క స్థానానికే ప‌రిమిత‌మైన మ‌జ్లీస్ ఈసారి త‌న బలాన్ని ఐదుకు పెంచుకున్న‌ది. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌ధానంగా సీమాంచల్ రీజియ‌న్‌లో పార్టీ త‌న అభ్య‌ర్థుల‌ను బ‌రిలో నిలిపింది‌.

అత్యంత కీలకమైన, రాజకీయంగా ప్రాధాన్యత గల సీమాంచల్ ప్రాంతంలో అయిదు అసెంబ్లీ సీట్లను ఎంఐఎం తన ఖాతాలో వేసుకోగలిగింది. కిషన్ గంజ్ సిట్టింగ్ స్థానాన్ని పోగొట్టుకున్నప్పటికీ.. దానికి నష్టపరిహారంగా అయిదు స్థానాలను దక్కించుకోగలిగింది.

అత్యంత కీలకమైన, రాజకీయంగా ప్రాధాన్యత గల సీమాంచల్ ప్రాంతంలో అయిదు అసెంబ్లీ సీట్లను ఎంఐఎం తన ఖాతాలో వేసుకోగలిగింది. కిషన్ గంజ్ సిట్టింగ్ స్థానాన్ని పోగొట్టుకున్నప్పటికీ.. దానికి నష్టపరిహారంగా అయిదు స్థానాలను దక్కించుకోగలిగింది. అయితే రాబోయే బెంగల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసి సత్తా చాటుతామని ఆ పార్టీ అధినేత అసద్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu