రేపటి నుంచే నామినేషన్లు, నిమ్మగడ్డకు ఉద్యోగుల షాకులు, విధులకు గైర్హాజరీతో పంచాయతీ ఎన్నికల క్రతువుపై ఎడతెగని ఉత్కంఠ

అదే డైలమా? అదే సస్పెన్స్? ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఆగేనా? సాగేనా? హైకోర్టు సిగ్నల్‌తో నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ఎన్నికల ప్రధానాధికారి..

  • Venkata Narayana
  • Publish Date - 8:06 am, Sun, 24 January 21
రేపటి నుంచే నామినేషన్లు, నిమ్మగడ్డకు ఉద్యోగుల షాకులు, విధులకు గైర్హాజరీతో పంచాయతీ ఎన్నికల క్రతువుపై ఎడతెగని ఉత్కంఠ

అదే డైలమా? అదే సస్పెన్స్? ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఆగేనా? సాగేనా? హైకోర్టు సిగ్నల్‌తో నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు ఉద్యోగులు షాకుల మీద షాకులిస్తున్నారు. నిన్న(శనివారం) మధ్యాహ్నం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు ఎవరూ హాజరుకాలేదు. ఊహించని రీతిలో ఝలక్ ఇచ్చారు. రేపు సుప్రీం కోర్టు మార్గదర్శకాలపైనే ఆశలు పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఏ నిమిషంలో అయినా బ్రేక్‌ పడకపోతుందా అన్న హోప్స్‌తో ఉంది. షెడ్యూల్ ప్రకారం ఏపీలో రేపటి(సోమవారం) నుంచే మొదటి విడత ఎన్నికలు జరిగేచోట నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం ఏమాత్రం ఎస్ఈసీకి సహరించడంలేదు. దీంతో ఇంకా ఎలాంటి స్పష్టతా రాకపోవడంతో అంతా అయోమయం నెలకొంది. అయితే అసలు రేపు సుప్రీంకోర్టు ముందుకు ఈ కేసు వస్తుందా? లేదా? వచ్చినా.. సుప్రీం క్లారిటీ ఇస్తుందా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు సుప్రీం కోర్టు ఏం చెప్పినా.. అందుకు తాము సిద్ధమంటోంది ఎన్నికల సంఘం. అయితే ఏపీలో ఏం జరుగుతుందన్న టెన్షన్ కొనసాగుతోంది. అవి పంచాయతీ ఎన్నికలే అయినా.. అసెంబ్లీ ఎన్నికలకు మించిన సమరం సాగుతోంది.