యూరప్‌లో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది మృతి

యూరప్‌లో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది మృతి

రష్యాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈస్టర్న్ సిజెక్‌ రిపబ్లిక్‌ల పట్టణంలోని బౌమిన్‌ ప్రాంతంలో శనివారం నాడు ఓ బహుళ అంతస్థుల బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 09, 2020 | 6:15 AM

యూరప్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈస్టర్న్ సిజెక్‌ రిపబ్లిక్ దేశంలోని బౌమిన్‌ పట్టణ ప్రాంతంలో శనివారం నాడు భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు పదకొండు మంది వరకు మరణించగా.. పలువురు గాయపడ్డారు. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బౌమిన్‌ ప్రాంతంలోని పదమూడు అంతస్థుల బిల్డింగ్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుందని.. ఈ ఘటనలో పది మంది మరణించారని వెల్లడించారు. అయితే మరొకరు కూడా మరణించినట్లు తెలుస్తోంది. మొత్తం ఈ ప్రమాదంలో 11 మంది మరణించారు. ముగ్గురు పిల్లలు.. ముగ్గురు పెద్దలు నివాసం ఉంటున్న ఓ ఇంట్లో తొలుత అగ్నిప్రమాదం చోటుచేసుకుందని.. ఆ తర్వాత అవి పక్కన ఉన్న ఇళ్లకు కూడా వ్యాపించాయన్నారు. అయితే మంటలు ఎక్కువగా వ్యాపిస్తుండటంతో.. పన్నెండో అంతస్థు నుంచి ఓ వ్యక్తి బయటకు దూకడంతో ప్రాణాలు కోల్పోయాడని తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read More :

మహారాష్ట్రలో 5లక్షలు దాటిన కేసులు

దేశ రాజధానిలో పేలిన సిలిండర్‌.. 14 మందికి గాయాలు

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu