డ్రమ్ముల కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

దేశరాజధాని ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఘిటోర్నిలోని ఓ డ్రమ్ముల స్టోరేజ్‌ కంపెనీలో మంటలు చెలరేగాయి. తొలుత డ్రమ్ముల స్టోరేజ్‌‌లో వ్యాపించిన మంటలు…తర్వాత కంపెనీ అంతటా వ్యాపించాయి. సమీప ప్రాంతమంతా దట్టమైన పొగలతో కమ్మేసింది. దీంతో అక్కడ స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 18 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదని.. అయితే […]

డ్రమ్ముల కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2019 | 4:02 AM

దేశరాజధాని ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఘిటోర్నిలోని ఓ డ్రమ్ముల స్టోరేజ్‌ కంపెనీలో మంటలు చెలరేగాయి. తొలుత డ్రమ్ముల స్టోరేజ్‌‌లో వ్యాపించిన మంటలు…తర్వాత కంపెనీ అంతటా వ్యాపించాయి. సమీప ప్రాంతమంతా దట్టమైన పొగలతో కమ్మేసింది. దీంతో అక్కడ స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 18 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదని.. అయితే భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.