Reserve Bank of India: కీలక విషయం వెల్లడించిన సెబీ, రిజర్వ్ బ్యాంక్.. ఫేస్‌బుక్, అమెజాన్, గూగుల్ సంస్థల..

Reserve Bank of India: భారతీయ రిజర్వు బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్ వంటి సంస్థల..

Reserve Bank of India: కీలక విషయం వెల్లడించిన సెబీ, రిజర్వ్ బ్యాంక్.. ఫేస్‌బుక్, అమెజాన్, గూగుల్ సంస్థల..
Follow us

|

Updated on: Jan 30, 2021 | 5:04 PM

Reserve Bank of India: భారతీయ రిజర్వు బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్ వంటి సంస్థల ఆర్థిక కార్యకలాపాలపై నియంత్రణలు విధిస్తున్నట్లు తెలిపింది. అవసరమైన అనుమతులు పొందిన తర్వాత మాత్రమే అవి పని చేయడానికి ఆస్కారం ఉంటుందని పేర్కొంది. ఆ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఢిల్లీ హైకోర్టుకు నివేదించింది. భారతదేశంలో గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్ వంటి ప్రముఖ కంపెనీల ఆర్థిక కార్యకలాపాల నియంత్రణకై తీసుకుంటున్న చట్టపరమైన నియమావళిని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

దీనిపై సమాధానం చెప్పాలంటూ రిజర్వు బ్యాంక్, సెబీ లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ మేరకు రిజర్వ్ బ్యాంక్, సెబీ స్పందించాయి. సదరు సంస్థల ఆర్థిక కార్యకలాపాలపై నియంత్రణ ఉంటుందని రెండు సంస్థలు తెలిపారు. సెక్యూరిటీల మార్కెట్‌లోకి ప్రవేశించే ఏ సంస్థకైనా తప్పనిసరి రిజిస్ట్రేషన్‌కై నిబంధనలు అమల్లో ఉన్నాయని సెబీ పేర్కొంది. అలాగే, సెక్యూరిటీస్ మార్కెట్ డేటా, డేటా పెరీమీటర్లు, డేటా అంతరాలు, డేటా గోప్యత వంటి వాటిని యాక్సెస్ చేసుకునేందుకు అవసరమైన పాలసీ రూపకల్పనకై మార్కెట్ డేటా అడ్వైజరీ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు హైకోర్టు ధర్మాసనానికి సెబీ తెలిపింది.

Also read:

AP Panchayat Elections 2021: కుల ధ్రువపత్రాలపై అధికారులకు ఎస్​ఈసీ కీలక ఆదేశాలు.. అవి కూడా తీసుకోవాలని సూచన