Pakistan: పాకిస్తాన్‌లో రెండు గ్రూపుల మధ్య అల్లర్లు.. 10 మంది మృతి

  పాకిస్తాన్‌లోని గిరిజన ప్రాంతంలో అటవీ భూమిని స్వాధీనం చేసుకోవడంపై రెండు ప్రత్యర్థి సమూహాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో కనీసం 10 మంది మరణించారు.

Pakistan: పాకిస్తాన్‌లో రెండు గ్రూపుల మధ్య అల్లర్లు.. 10 మంది మృతి
Pakistan

Pakistan:  పాకిస్తాన్‌లోని గిరిజన ప్రాంతంలో అటవీ భూమిని స్వాధీనం చేసుకోవడంపై రెండు ప్రత్యర్థి సమూహాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో కనీసం 10 మంది మరణించారు. 15 మంది గాయపడ్డారు. ఈ మేరకు ఆదివారం అధికారులు సమాచారం అందించారు. ఈ సంఘటన దేశంలోని వాయువ్య ప్రాంతంలో జరిగింది. శనివారం మధ్యాహ్నం రాష్ట్ర రాజధాని పెషావర్‌కు 251 కిలోమీటర్ల దూరంలో ఖుర్రం జిల్లాలోని తేరి మెగల్ గ్రామంలో నివసిస్తున్న గైడు తెగ ప్రజలు గ్రామంలో కట్టెలు కొడుతున్న పెవార్ వంశ సభ్యులపై దాడి చేయడంతో ఘర్షణ ప్రారంభమైంది. 

ఖుర్రం జిల్లా (పాకిస్తాన్ గిరిజన ప్రాంతంలో ఘర్షణలు) ఎగువ సబ్‌డివిజన్‌లోని అటవీ యాజమాన్యంపై గత కొన్ని నెలలుగా రెండు తెగల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ, “శనివారం నలుగురు మరణించారు, ఈ రోజు (ఆదివారం) మరో ఆరుగురు మరణించారు, పెవార్ వంశం ప్రతీకారం తీర్చుకుంది. ముష్కరులు కాలువలో దాక్కుని దాడి చేశారు. ఈ సమయంలో, భారీ ఆయుధాలు, రాకెట్ లాంచర్లు కూడా రెండు వైపులా ఉపయోగించారు.

వాయువ్య పాకిస్థాన్‌లోని ఖుర్రం జిల్లా పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉంది, ఇక్కడ నేరాలు, ఉగ్రవాద దాడులలో తుపాకుల వాడకం తరచుగా జరుగుతుంది (ఆఫ్ఘన్ పాకిస్తాన్ ఘర్షణలు). గిరిజనుల పెద్దలు, ప్రభుత్వ పెద్దలు గైడు, పెవార్ కులస్తుల మధ్య సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అధికారి తెలిపారు. పోలీసులు, పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపారు. కడపటి వార్తలు అందేసరికి ఇంకా  రెండు తెగల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.

పాకిస్థాన్‌లో నేరాలు వేగంగా పెరుగుతున్నాయి. గత వారం, ఒక దొంగతనం కేసులో 50 ఏళ్ల వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమార్తెలను కాల్చి చంపాడు. ఈ సంఘటన దేశంలోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని స్వాబి జిల్లాలోని కలు ఖాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితుడిని జన్ బహదూర్ (పాకిస్థాన్‌లో కాల్పుల ఘటన) గా గుర్తించారు. తన భార్య, కుమార్తెలు మర్దాన్ మెడికల్ కాంప్లెక్స్ నుండి నవజాత శిశువును దొంగిలించారని అతను అనుమానించాడు. 

ఇవి కూడా చదవండి: Ant Eaters: పొడవాటి నాలుకలతో చీమలను తింటూ జీవించే జీవుల గురించి మీకు తెలుసా?

Terrorism: ఉప్పెనంత విషాదం గుండెల్లో.. కొండంత ఆత్మవిశ్వాసం ఆ చిరునవ్వుల్లో.. ఈ ఫోటో వెనుక హృదయాలను కదిలించే కథ!

Smart Bandage: ఈ స్మార్ట్ బ్యాండేజ్ శరీరంలో గాయాల పరిస్థితిని ఎప్పటికప్పుడు మీకు చెబుతుంది.. ఎలా అంటే..

Click on your DTH Provider to Add TV9 Telugu