కరోనాపై పోరాడుతూ ముందుకు వెళ్దాం, వైరస్ నియంత్రణ చర్యలకు రూ.50 కోట్లు విడుదల

కరోనాతో సహజీవనం చేస్తూ ముందుకు వెళ్లాల్సిందే. దేశంలో ఈ మాట చెప్పిన తొలి నాయకుడు ఏపీ సీఎం జగన్. ఈ వ్యాఖ్యల అనంతరం ఆయనపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

  • Ram Naramaneni
  • Publish Date - 4:11 pm, Thu, 26 November 20
కరోనాపై పోరాడుతూ ముందుకు వెళ్దాం, వైరస్ నియంత్రణ చర్యలకు రూ.50 కోట్లు విడుదల

కరోనాతో సహజీవనం చేస్తూ ముందుకు వెళ్లాల్సిందే. దేశంలో ఈ మాట చెప్పిన తొలి నాయకుడు ఏపీ సీఎం జగన్. ఈ వ్యాఖ్యల అనంతరం ఆయనపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ తర్వాతి కాలంలో ఏపీ ముఖ్యమంత్రి మాటే నిజమైంది. సరైన జాగ్రత్తలు తీసుకుంటూ జీవనాన్ని సాగించాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇప్పటికీ ఈ వైరస్‌కు సమర్థవతమైన వ్యాక్సిన్‌ కానీ, మెడిసిన్ కానీ రాలేదు. మరోవైపు కరోనాపై పోరులోనూ జగన్ సర్కార్ వెనక్కి తగ్గడం లేదు. సంక్షేమం, అభివృద్దిని బ్యాలెన్స్ చేస్తూ వైరస్‌పై పోరాటం కొనసాగిస్తోంది. టెస్టులు విషయంలో దూకుడు ప్రదర్శించి..వ్యాధి నియంత్రణకు చర్యలు చేపట్టింది.

తాజాగా ఏపీలో కరోనా నియంత్రణ చర్యలకు వైద్యారోగ్య శాఖ నిధులు విడుదల చేసింది. 50 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులు జారీ చేస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తంతో కరోనా టెస్ట్ కిట్లు, మందులు, కొవిడ్ సెంటర్ల నిర్వహణ వంటివి చేపట్టనున్నారు.

Also Read :

ఏపీపై నివర్ తుఫాన్ ఎఫెక్ట్, పలు జిల్లాల్లో నమోదైన భారీ వర్షపాతం, వివరాలు…

జమిలి ఎన్నికలు భారత్​కు అవసరం, ప్రిసైడింగ్ అధికారుల 80వ సదస్సులో ప్రధాని కీలక వ్యాఖ్యలు