పోలీసులను చూసి భార్యను నడిరోడ్డు మీద వదిలేసి పారిపోయిన భర్త.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..?

పోలీసులు పట్టుకుంటారని భయపడి భార్యను రోడ్డుపై వదిలేసి పారిపోయాడు.

  • Balaraju Goud
  • Publish Date - 4:55 am, Mon, 11 January 21
పోలీసులను చూసి భార్యను నడిరోడ్డు మీద వదిలేసి పారిపోయిన భర్త.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..?

రంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి పోలీసులు పట్టుకుంటారని భయపడి భార్యను రోడ్డుపై వదిలేసి పారిపోయాడు. తీరా పోలీసులు అతని గురించి తెలుసుకుని వెతికి మరీ భార్య వద్దకు చేర్చారు. ఈ ఘటన శంషాబాద్ మండలంలోని తొండుపల్లి ఓఆర్ఆర్ జంక్షన్ వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన రాజు.. భార్య సీతతో కలిసి శంషాబాద్‌ నుంచి షాద్‌నగర్‌ వైపు బైక్‌పై వెళ్తున్నాడు. అయితే, అప్పటికే రాజు మద్యం సేవించి ఉన్నాడు. తొండుపల్లి ఔటర్‌ రింగ్‌రోడ్డు జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇది గమనించిన రాజు తానూ పట్టుబడటం ఖాయం అనుకున్నాడు. భార్యను బైక్ నుంచి కిందకు దించిన రాజు పరారయ్యాడు. దీంతో ఆమె రోడ్డుపై నిలబడి ఏడుస్తుండగా గమనించిన పోలీసులు.. దగ్గరకు వెళ్లి ఆరా తీశారు. ఆమె జరిగిన విషయం చెప్పడంతో రాజును వెతికి పట్టుకొచ్చారు. రాజును తీవ్రంగా మందలించిన పోలీసులు దంపతులిద్దరిని అక్కడి నుంచి పంపించేశారు.

రాజేంద్రనగర్‌లో దారుణం.. ఓ వ్యక్తిని వెంబడించి కత్తులతో హతమార్చిన దుండగులు