కరోనా కరాళ నృత్యానికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కు చెందిన బివిఎం కళాశాల డైరెక్టర్ మనోజ్ సింగ్ కుష్వాహా తండ్రి జగదీష్ సింగ్ కుష్వాహాకు ఫేస్ బుక్ ద్వారా 3500 మందికి పైగా సంతాపం తెలిపారు. తండ్రికి ఫేస్ బుక్ ద్వారా నివాళులు అర్పించే కార్యక్రమాన్ని మనోజ్ సింగ్ అతని ముగ్గురు సోదరులు అలోక్, ప్రభాత్, ఆదర్ష్ లు నిర్వహించారు. ఏప్రిల్ 7 న వీరి తండ్రి మృతి చెందారు. లాక్ డౌన్ క్రమంలో కఠిన నిబంధనలు అమలవుతుందున మనోజ్ సింగ్ ఆన్ లైన్ లో తండ్రి సంతాప సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
దీంతో.. సమాచారాన్ని స్నేహితులకు, బంధువులకు వాట్సాప్ ద్వారా తెలియజేశారు. అనుకున్న విధంగా శుక్రవారం సాయంత్రం 5 నుండి 6 వరకు ఫేస్ బుక్ లో శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. దీనిని ఏకంగా 3500 మంది వీక్షించారు.వారంతా జగదీష్ సింగ్ కుష్వాహాకు నివాళులు అర్పించారు.