క‌రోనా కాటు..వాన చేటు..విల‌విల్లాడుతోన్న రైతన్న‌..

క‌రోనా కాటు..వాన చేటు..విల‌విల్లాడుతోన్న రైతన్న‌..

రైతుల‌కు ఈ ఏడాది క‌న్నీటి సంద్రంగా మారిపోయే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. పంట‌లు బాగా పండి కొద్దో, గొప్పో డ‌బ్బు చేతికొస్తుంది అనుకుంటోన్న స‌మ‌యంలో క‌రోనా కాటు వేసింది. దీంతో ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోని రైతుల‌కు దిక్కుతోచ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌భుత్వాలు స‌హాయ‌క చ‌ర్య‌లు చేస్తామ‌ని చెప్తోన్న కొన్ని ప్రాంతాల్లో పంట రైతుల‌ చేతుల్లోకి రాలేదు. అస‌లు కూలీలు దొర‌క‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు కూలీల ర‌వాణా క‌ష్ట‌త‌రంగా మారింది. తామే కొనుగోలు […]

Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Apr 09, 2020 | 8:34 PM

రైతుల‌కు ఈ ఏడాది క‌న్నీటి సంద్రంగా మారిపోయే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. పంట‌లు బాగా పండి కొద్దో, గొప్పో డ‌బ్బు చేతికొస్తుంది అనుకుంటోన్న స‌మ‌యంలో క‌రోనా కాటు వేసింది. దీంతో ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోని రైతుల‌కు దిక్కుతోచ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌భుత్వాలు స‌హాయ‌క చ‌ర్య‌లు చేస్తామ‌ని చెప్తోన్న కొన్ని ప్రాంతాల్లో పంట రైతుల‌ చేతుల్లోకి రాలేదు. అస‌లు కూలీలు దొర‌క‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు కూలీల ర‌వాణా క‌ష్ట‌త‌రంగా మారింది. తామే కొనుగోలు చేస్తామ‌ని ప్ర‌భుత్వాలు చెబుతోన్నా…అస‌లు పంట చేతికి ఎప్పుడు వ‌స్తుందో..ఆ త‌ర్వాత కొనుగోలు స‌మ‌యంలో త‌మ వంతు వ‌చ్చేస‌రికి ఎంత స‌మ‌యం ప‌డుతుందో అన్న నైరాశ్యం రైతు వ‌ర్గాల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ అయోమ‌యంలో ఉండ‌గానే వాన రైతుల‌పైకి మ‌రో దాడి చేసింది. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో అకాల వ‌ర్షాలు కురుస్తున్నాయి. మ‌రో రెండు వారాలు ఇదే ప‌రిస్థితి కొన‌సాగే ప్రమాదం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ చెప్తోంది .ఈ వాన‌ల‌కు పొలంలోనే ఉన్న పంట‌లు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. ముఖ్యంగా మిర్చి, మామిడి, మొక్కజొన్న‌, అర‌టి వంటి పంట‌ల‌పై తీవ్ర ప్ర‌భావం ఉంది. మ‌రి రైతులకు ఇబ్బంది క‌ల‌గ‌నియ్య‌మ‌ని చెప్తున్న ప్ర‌భుత్వాలు ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై ఎలా స్పందిస్తాయో చూడాలి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu