మే 30న రైతు భరోసా జగన్ తాజా నిర్ణయం

మే 30న రైతు భరోసా జగన్ తాజా నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే 30వ తేదీన రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రైతు భరోసా కేంద్రాల ప్రారంభానికి అవసరమైన సన్నాహాలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Rajesh Sharma

|

May 02, 2020 | 4:27 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే 30వ తేదీన రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రైతు భరోసా కేంద్రాల ప్రారంభానికి అవసరమైన సన్నాహాలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈలోగా మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

రాష్ట్రంలో స్టేట్ లెవెల్ నుంచి మండల స్థాయి వరకు వ్యవసాయ సలహా బోర్డులను ఏర్పాటుపై ఇదివరకే నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి.. వాటి విధివిధానాలను వీలైనంత త్వరగా ఖరారు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సలహా బోర్డులను ఆర్.బీ.కే.లకు అనుసంధానం చేయాలని సీఎం సూచించారు.

జూన్ 6వ తేదీన మత్స్యకారుల భరోసా కార్యక్రమాన్ని నిర్వహించాలని మత్స్య శాఖ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు పరిస్థితిని ముఖ్యమంత్రి జగన్ శనివారం సమీక్షించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద విధిగా ధాన్యం కొలిచే సాధనాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu