మమ్మల్ని అంతం చేయడానికి, ట్రాక్టర్ ర్యాలీ ఆపడానికి కుట్ర, రైతు సంఘాల నేతల ఆరోపణ, పోలీసులకు ఒకరి అప్పగింత,

రైతుల ఆందోళనలో కొత్త మలుపు ! తమను అంతం చేయడానికి, ఈ నెల 26 న తమ ట్రాక్టర్ ర్యాలీని భంగ పరచేందుకు కుట్ర జరుగుతోందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు.

  • Umakanth Rao
  • Publish Date - 5:22 pm, Sat, 23 January 21
మమ్మల్ని అంతం చేయడానికి, ట్రాక్టర్ ర్యాలీ ఆపడానికి  కుట్ర, రైతు సంఘాల నేతల ఆరోపణ,  పోలీసులకు ఒకరి అప్పగింత,

రైతుల ఆందోళనలో కొత్త మలుపు ! తమను అంతం చేయడానికి, ఈ నెల 26 న తమ ట్రాక్టర్ ర్యాలీని భంగ పరచేందుకు కుట్ర జరుగుతోందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. సింఘు బోర్డర్ లో మీడియాతో మాట్లాడిన వారు.. తాము ఓ వ్యక్తిని పట్టుకున్నామని, నలుగురు రైతు నేతలపై కాల్పులు జరపాలని, ట్రాక్టర్ ర్యాలీని అడ్డుకోవాలని కొందరు తనను ఆదేశించినట్టు ఆ వ్యక్తి తెలిపాడని వెల్లడించారు. ముఖానికి స్కార్ఫ్ ధరించి ఉన్న ఇతడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. తనతో బాటు ఇద్దరు మహిళలతో సహా 9 మంది కూడా ఈ కుట్రలో భాగస్వాములుగా ఉన్నారని ఈ వ్యక్తి చెప్పినట్టు వారు పేర్కొన్నారు. సుమారు 21 ఏళ్ళ ఈ వ్యక్తిని రైతులు హర్యానా పోలీసులకు అప్పగించారు. సోనేపట్ ఖాకీలు ఇతడిని విచారిస్తున్నారు. కాగా కొంతమంది పోలీసు అధికారుల పేర్లను కూడా ఈ యువకుడు వెల్లడించాడు. కానీ వారి గురించి రైతులు తెలుసుకోగా-తమకు ఈ యువకునికి అసలు సంబంధమే లేదని వారు చెప్పినట్టు తెలుస్తోంది.


Read More:రైతుల ఆందోళనలో పురోగతి, రెండ్రోజులు మందుగానే దిగొచ్చిన కేంద్రం.. మంగళవారం చర్చలు అసంపూర్ణం.
Read Also :ఆందోళనలో మహారాష్ట్ర రైతులు కూడా ! నాసిక్ నుంచి ఢిల్లీకి ప్రయాణం, చట్టాల రద్దుకై హర్యానాలో అన్నదాతల హోమం,