కరోనాతో ప్ర‌ముఖ‌ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్‌రెడ్డి మృతి

ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్‌రెడ్డి కోవిడ్ కార‌ణంగా మృతి చెందారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్దార‌ణ అవ్వ‌డంతో హైదరాబాద్‌లోని యశోద హ‌స్పిటిల్‌లో చేరి చికిత్స పొందారు.

  • Ram Naramaneni
  • Publish Date - 7:18 pm, Wed, 12 August 20
కరోనాతో ప్ర‌ముఖ‌ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్‌రెడ్డి మృతి

ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్‌రెడ్డి కోవిడ్ కార‌ణంగా మృతి చెందారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్దార‌ణ అవ్వ‌డంతో హైదరాబాద్‌లోని యశోద హ‌స్పిటిల్‌లో చేరి చికిత్స పొందారు. ఆయన ఆరోగ్యం ప‌రిస్థితి మరింతగా విషమించడంతో బుధవారం మధ్యాహ్నం క‌న్నుమూశారు. హైకోర్టు మాజీ జడ్జి చెన్నకేశవరెడ్డి కుమారుడే పాలెం శ్రీకాంత్‌రెడ్డి. గతంలో శ్రీకాంత్‌రెడ్డి కడప ఎంపీగా సైతం పోటీ చేశారు. రాయలసీమ డెవ‌ల‌ప్‌మెంట్‌కు రాజకీయాలకు అతీతంగా పనిచేశారు. మోడరన్‌ రాయలసీమ ఫౌండ‌ర్ ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు.

 

Also Read : “12 శాతం వ‌డ్డీతో ఆ జీతాలు చెల్లించండి : ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ జీవోలు ర‌ద్దు”