Gas Cylinder Blast: తమిళనాడులో భారీ పేలుడు.. కుప్ప కూలిన మూడు ఇళ్లు.. శిథిలాల కింద జనాలు..

Gas Cylinder Blast: గ్యాస్‌ సిలిండర్‌ పేలుళ్లు భారీగానే జరుగుతున్నాయి. ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ను ఆఫ్‌ చేయకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, గ్యాస్‌ సిలిండర్‌, స్టైవ్‌లలో..

Gas Cylinder Blast: తమిళనాడులో భారీ పేలుడు.. కుప్ప కూలిన మూడు ఇళ్లు.. శిథిలాల కింద జనాలు..
Follow us

|

Updated on: Nov 23, 2021 | 1:19 PM

Gas Cylinder Blast: గ్యాస్‌ సిలిండర్‌ పేలుళ్లు భారీగానే జరుగుతున్నాయి. ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ను ఆఫ్‌ చేయకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, గ్యాస్‌ సిలిండర్‌, స్టైవ్‌లలో సమస్యలు ఉండటం వల్ల ఇలాంటి ప్రమాదాలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడులో భారీ పేలుడు జరిగింది. రాష్ట్రంలోని సేలం జిల్లాలో ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ పేలుడు కారణంగా మూడు ఇళ్లు కుప్పకూలిపోగా, ఒకరు మృతి చెందారు. 10 మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. అయితే కూలిపోయిన భవనాల శితిలాల కింద చాలా మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న రెస్క్యూ టీమ్‌ ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. శిథిలాల నుంచి ఐదుగురిని వెలికి తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కాగా, హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో 15 మందికి గాయాలు అయ్యాయి. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసం అయ్యింది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇలా చాలా ప్రాంతాల్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు కారణంగా భారీ ఎత్తున నష్టం జరుగుతోంది. ఇళ్లల్లో గ్యాస్‌ సిలిండర్‌ వాడే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఫైర్‌ సిబ్బంది, పోలీసులు అవగాహన కల్పి్స్తున్నారు. అయినా పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

Gun Misfire: శిక్షణలో ఉండగ తొటి ఉద్యోగి తుపాకీ మిస్‌ఫైర్‌.. కానిస్టేబుల్‌ మృతి..

Road Accident: ఘోర ప్రమాదం.. అదుపు తప్పి లోయలో పడ్డ కారు.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

ఈ వెబ్ సిరీస్ ఒంటరిగా చూడాలంటే చాలా ధైర్యం కావాలి..
ఈ వెబ్ సిరీస్ ఒంటరిగా చూడాలంటే చాలా ధైర్యం కావాలి..
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
549 పరుగులు, 81 బౌండరీలు.. మరోసారి రికార్డులు బద్దలవ్వాల్సిందే
549 పరుగులు, 81 బౌండరీలు.. మరోసారి రికార్డులు బద్దలవ్వాల్సిందే
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
చిన్నారి మహాలక్ష్మి ఎవరో గుర్తుపట్టగలరా ?..
చిన్నారి మహాలక్ష్మి ఎవరో గుర్తుపట్టగలరా ?..
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్