Explained: పాల ధరలు పెరగడానికి కారణాలివే.. ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న పాడి పరిశ్రమ

పాలు, పెరుగు ధరలు ఇటీవల కాలంలో పెరగడంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. ఇటీవల కాలంలో ఫ్యాకేజ్డ్ పాలు, పెరుగును జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంతో వాటి ధరలు..

Explained: పాల ధరలు పెరగడానికి కారణాలివే.. ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న పాడి పరిశ్రమ
Amul Milk (File Photo)
Follow us

|

Updated on: Aug 18, 2022 | 8:39 AM

Explained: పాలు, పెరుగు ధరలు ఇటీవల కాలంలో పెరగడంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. ఇటీవల కాలంలో ఫ్యాకేజ్డ్ పాలు, పెరుగును జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంతో వాటి ధరలు పెరిగాయి. నెల తిరగకుండా డెయిరీ దిగ్గజం అమూల్ తో పాటు, మదర్ డెయిరీ లీటరు పాలు పై రూ.2 ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో సామన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో పాలు నిత్యావసర వస్తువుగా మారిపోవడంతో ఈధరల పెంపు తమపై అదనపు భారమంటున్నారు వేతన జీవులు. అయితే పాల ధర పెంపును ప్రముఖ డెయిరీ కంపెనీలు సమర్థించుకుంటున్నాయి. పాడి పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల ధర పెంచాల్సి వచ్చిందని డెయిరీ సంస్థలు ప్రకటించాయి. పాల ఉత్పత్తి ధర ఖర్చు పెరగడం, పశువుల దాణా ఖర్చు గత ఏడాదితో పోలిస్తే 20 శాతం పెరిగిందని సోనాయ్ బ్రాండ్ పేరుతో రిటైల్ గా పాలు విక్రయిస్తున్న ఇందాపూర్ డెయిరీ అండ్ డైరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఛైర్మన్ దశరథ్ మానే తెలిపారు.

ఇన్ పుట్ కాస్ట్ పెరగడంతో రైతులకు ఇచ్చే ధరను 8 నుంచి 9 శాతం పెంచాల్సి వచ్చిందని దీంతో పాల ధర పెరిగినట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే పాల ఉత్పత్తి 8 నుంచి 10 శాతం తగ్గిందని దరశథ్ మానే వెల్లడించారు. గత ఏడాది ఆగష్టులో తమ డెయిరీ రోజుకు 23 లక్షల లీటర్ల పాలను సేకరించగా.. ప్రస్తుతం రోజుకు 20 లక్షల లీటర్ల పాలనే సేకరిస్తోందని ఆయన తెలిపారు. పాల ఉత్పత్తి తగ్గడం కూడా ధరల పెంపునకు ప్రధాన కారణంగా తెలిపారు. పాల దిగుబడి తగ్గడంతో పాటు.. పశువుల దాణా ఖర్చులు పెరిగాయన్నారు. ఇటీవల కాలంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం కారణంగా పశుగ్రాసం దిగుబడి తగ్గిందని.. దీంతో దాణా ధరలు పెరిగినట్లు దశరథ్ మానే వెల్లడించారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాల ప్రకారం.. పాల ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగిందని.. పశువుల దాణా ధర గత ఏడాదితో పోలిస్తే సుమారు 25 శాతం పెరిగింది. పాలను ఎక్కువుగా ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో పశువులు రకరకాల వ్యాధులకు గురికావడం కూడా ధరల పెరుగుదల కు కారణమైంది. గుజరాత్, పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో పశువులకు చర్మ వ్యాధులు వ్యాపించాయి. వీటితో పాటు రవాణా, నిర్వహణ ఖర్చులు, ఇంధనం ధరలు, హ్యుమన్ రీసోర్స్ కాస్ట్ పెరిగాయి.

ఇది కూడా చదవండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..