ముగిసిన మెట్రో గోల్డెన్ ఆఫర్.. రాయితీ నిలుపుదల.. మరోసారి పొడిగించాలంటూ ప్రయాణికుల డిమాండ్.!!

Metro Golden Offer: కరోనా వచ్చినప్పటి నుంచి ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరికి తెలిసిందే.

  • uppula Raju
  • Publish Date - 10:05 am, Sun, 17 January 21
ముగిసిన మెట్రో గోల్డెన్ ఆఫర్.. రాయితీ నిలుపుదల.. మరోసారి పొడిగించాలంటూ ప్రయాణికుల డిమాండ్.!!

Metro Golden Offer: కరోనా వచ్చినప్పటి నుంచి ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరికి తెలిసిందే. వారికి కొంచెం ఊరటనివ్వడానికి అప్పట్లో హైదరాబాద్ మెట్రో సువర్ణ ఆఫర్ ప్రకటించింది. దీంతో ప్రయాణికులు కొంచెం రిలీఫ్ అయ్యారు. ఈ ఆఫర్ తర్వాత మెట్రో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు కూడా ముందుకు వచ్చారు.

అయితే ఆ ఆఫర్ ఈ నెల15తో ముగిసిపోయింది. దీంతో రాయితీలను మెట్రో నిలిపివేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికులు సదరు ఆఫర్‌ను మరికొంత కాలం పొడిగించాలంటూ హైదరాబాద్ మెట్రోను కోరుతున్నారు. కానీ ఎల్అండ్‌టీ మాత్రం అందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. కాగా, 2020 అక్టోబర్ 17 నుంచి జనవరి 15 వరకు సువర్ణ ఆఫర్ కొనసాగిన సంగతి విదితమే. ఆ సమయంలో మెట్రోలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు అధికంగా ముందుకు వచ్చారు. కొవిడ్ నియంత్రణలో భాగంగా మెట్రో తీసుకుంటున్న చర్యలు కూడా బాగున్నాయని కొనియాడారు. ఇలా మెట్రోకు చాలామంది అలవాటు పడ్డారు.

మెట్రో ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇకపై వాటికి కూడా అనుమతి..!

హైదరాబాద్ మెట్రోకు ఎనిమిది అవార్డులు… పర్యావరణ పరిరక్షణ చర్యలకు గుర్తింపన్న ఎన్వీ‌ఎస్ రెడ్డి…