మరో కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్.. టీకా మొదటి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కోరుతూ దరఖాస్తు..!

ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌ ఫేజ్‌-1, ఫేజ్‌-2 క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం భారత్‌ బయోటెక్‌ కంపెనీ డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది.

  • Balaraju Goud
  • Publish Date - 5:40 pm, Wed, 20 January 21
మరో కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్.. టీకా మొదటి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కోరుతూ దరఖాస్తు..!

 Trial of Nasal Vaccine : కొవిడ్‌-19 నియంత్రణకు భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌ ఫేజ్‌-1 క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతి ఇవ్వాలని భారత డ్రగ్‌ రెగ్యులేటర్‌కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీ ఎస్‌సీఓ) నిపుణుల ప్యానెల్ సిఫారు చేసింది. ఆ మేరకు అధికార వర్గాలు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో కరోనా టీకా అందుబాటులోకి వస్తే.. కోవిడ్‌కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో నాసల్ టీకా కూడా క్రీయాశీలకంగా మారుతుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌ ఫేజ్‌-1, ఫేజ్‌-2 క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం అనుమతి కోరుతూ హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ కంపెనీ డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు చేసుకుంది. దీనిపై సబ్జెక్ట్‌ నిపుణుల కమిటీ మంగళవారం దరఖాస్తును పరిశీలించి తొలి విడత ట్రయల్స్‌కు సిఫారసు చేసింది. మొదటి క్లినికల్‌ ట్రయల్స్‌ భద్రత, ఇమ్యునోజెనిసిటీ డేటా ఆధారంగా రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతి ఇవ్వనున్నట్లు ఓ అధికారి పేర్కొన్నారు.

తమిళనాడు కోర్టు సంచలన తీర్పు.. లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఉపాధ్యాయుడికి 49 ఏళ్ల జైలు శిక్ష