భూపాలపల్లి జిల్లాలో ఎదురు కాల్పులు.. తీరా చూస్తే..!

భూపాలపల్లి జిల్లాలో ఎదురు కాల్పులు.. తీరా చూస్తే..!

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీసులు- మావోయిస్టుల మధ్య మంగళవారం మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. మహాదేవపూర్ ఏరియా కమిటీ దళం పలిమేల అటవీ ప్రాంతంలో...

Rajesh Sharma

|

Nov 10, 2020 | 7:18 PM

Exchange of fire in Bhupalapally district: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీసులు- మావోయిస్టుల మధ్య మంగళవారం మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. మహాదేవపూర్ ఏరియా కమిటీ దళం పలిమేల అటవీ ప్రాంతంలో మావోస్టులు సమావేశమయ్యారనే సమాచారంతో పోలీస్ బలగాలు మెరుపుదాడి చేశారు. ఈ సందర్భంలో చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగక పోగా… మావోయిస్టులకు చెందిన కిట్ బ్యాగులు, తుపాకీ, ఇతర సామాగ్రి బారీ ఎత్తున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీస్ బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి.

ఈ ఎదురుకాల్పులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండలంలోని పెద్దంపేట- లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో జరిగాయి. మహాదేవపూర్ ఏరియా కమిటీ మావోయిస్టు దళం ఈ అడవుల్లో సమావేశమయ్యారనే సమాచారంతో గ్రేహౌండ్స్ బలగాలు మెరుపుదాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన మావోయిస్టులు తృటిలో తప్పించుకున్నారు. సంఘటనా స్థలంలో 12 కిట్ బ్యాగులు, 1 తుపాకీ, వాటర్ క్యాన్స్ తో పాటు, పది రౌండ్ల తూటాలు, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మహాదేవపూర్ ఏరియా కమిటీ దళ కమాండర్ రహేనా దళంతోపాటు, కీలక నేతలు భేటీ అయ్యారనే పక్కా సమాచారంతో గ్రేహౌండ్స్ బలగాలు దాడి చేశాయి. అప్రమత్తమైన మావోయిస్టులు తప్పించు కోవడంతో పోలీస్ బలగాలు ఈ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు తప్పించుకున్నట్లు సమాచారం. గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ALSO READ: బీజేపీ విజయంపై పవన్ కల్యాణ్ స్పెషల్ కామెంట్

ALSO READ: రిజల్ట్‌పై క్లారిటీ ఇచ్చిన ఈసీ

ALSO READ: దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంలో కొత్త ట్విస్టు

ALSO READ: ఎల్లుండి ఏపీలో ఉరుములతో పిడుగులు

ALSO READ: గ్రేటర్ ఎన్నికల దిశగా ఈసీ కీలక ఆదేశాలు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu