తెలంగాణ ముద్దు బిడ్డ, మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలలో భాగంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సమాలోచన సభ నిర్వహించనున్నారు. మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధ్యక్షతన, ఆగష్టు 26 న, ఉదయం 10 గంటల నుండి హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించనున్నారు. తెలంగాణ తేజం మన పీవి (సాహితీ సౌరభం – అసమాన దార్శనికత) పేరుతో సమాలోచన సభ జరగనుంది.
రాజ్యసభ సభ్యులు, పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు కే.కేశవరావు, పీవీ తనయుడు ప్రభాకర్ రావు, కూతురు వాణిదేవి, కవి అంపశయ్య నవీన్, రచయిత కల్లూరి భాస్కర్ ( ‘ఇన్ సైడర్’ అనువాదకుడు) ఈ సదస్సు కు హాజరుకానున్నారు. దేశానికి, రాష్ట్రానికి పీవీ అందించిన సేవలు, సంస్కరణలు, ఇతర అంశాలను ఈ సభ లో చర్చించనున్నారు.