India vs England: నరేంద్ర మోదీ పిచ్‌పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ సైటర్లు.. నాలుగో టెస్ట్ మ్యాచ్‌ కోసం నా ప్రాక్టీస్ సూపర్ అంటూ..

India vs England - 2021: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ పిచ్‌పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ విమర్శల పరంపరను కొనసాగిస్తున్నాడు.

India vs England: నరేంద్ర మోదీ పిచ్‌పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ సైటర్లు.. నాలుగో టెస్ట్ మ్యాచ్‌ కోసం నా ప్రాక్టీస్ సూపర్ అంటూ..
Follow us

|

Updated on: Mar 03, 2021 | 10:53 PM

India vs England – 2021: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ పిచ్‌పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ విమర్శల పరంపరను కొనసాగిస్తున్నాడు. పిచ్‌ తీరును మొదటి నుంచి తప్పుపడుతున్న వాన్.. తాజాగా మరో సెటైర్ పేల్చాడు. సోషల్ మీడియా వేదికగా పిచ్‌ను కామెంట్ చేస్తూ ఓ పోస్ట్ చేశాడు. భారత్-ఇంగ్లండ్ 4వ టెస్ట్ మ్యాచ్‌ కోసం అద్భుతమైన సాధన జరుగుతోందంటూ మోదీ పిచ్‌పై సెటైర్లు వేస్తూ ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ పెట్టాడు. ఈ ఫోటోలో పిచ్ సైజులో నేలను దున్ని.. ఆ దున్ని నేలలో వాన్ బ్యాటింగ్ చేస్తున్నట్లుగా ఉంది. ఈ ఫోటోకు క్యాప్షన్‌గా ‘నాలుగో టెస్ట్ కోసం నా ప్రిపరేషన్ సూపర్‌గా జరుగుతుంది’ అంటూ పెట్టాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదిలాఉంటే.. అంతముందు వారం కూడా ఇలాంటి పోస్టే పెట్టాడు వాన్.. నాలుగో టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధం చేసిన పిచ్‌ను ఇద్దేశించి.. ఎలాంటి పిచ్‌ను సిద్ధం చేస్తున్నారో చూడండి అంటూ పొలం దున్నతున్న ఫోటోను షేర్ చేశాడు. అసలు టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగింది మ్యాచ్ కాదని, అసలు టెస్ట్ మ్యా్చ్ నిర్వహణకు ఈ పిచ్ ఏమాత్రం అనుకూలంగా కాదని అన్నాడు. ఇలాంటి పిచ్‌లో ఏ జట్టు కూడా విజయం సాధించలేదంటూ సెటైర్లు వేశాడు. ఇకపోతే.. వాన్‌ను ఇండియన్ నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. అతని కామెంట్స్‌కి సెటైర్లు వేస్తున్నారు.

కాగా, అహ్మదాబాద్‌లో మోదీ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 తో సిరీస్‌లో పై చేయి సాధించింది. నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ టీమిండియా సొంతం అవుతుంది. నాలుగో టెస్ట్ మ్యా్చ్ కూడా మోదీ స్టేడియంలోనే జరుగనుంది. స్పిన్‌కు అనుకూలమైన ఈ పిచ్‌పై జరగనున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా సునాయాసంగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Michael Vaughan Insta Post:

Also read:

తమిళనాడు చిన్నమ్మ సంచలన నిర్ణయం… రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన శశికళ

Sasikala: శశికళ సంచలన నిర్ణయం.. రాజకీయాలకు, ప్రజా జీవితానికి గుడ్ బై.. డీఎంకేను ఓడించాలని పిలుపు