‘వాల్మీకి’ టైటిల్ మారినా.. ‘గద్దలకొండ గణేష్’ మార్క్ సెపరేట్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మాస్ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి.. అన్ని చోట్లా హిట్ టాక్ తెచ్చుకుంది. తమిళ హిట్ ‘జిగర్తాండా’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పూర్తి నెగటివ్ షేడ్‌లో కనిపిస్తాడు. పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో తమిళ హీరో అథర్వ మురళి కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాను తెలుగు […]

'వాల్మీకి' టైటిల్ మారినా.. 'గద్దలకొండ గణేష్' మార్క్ సెపరేట్
Follow us

|

Updated on: Sep 22, 2019 | 2:14 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మాస్ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి.. అన్ని చోట్లా హిట్ టాక్ తెచ్చుకుంది. తమిళ హిట్ ‘జిగర్తాండా’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పూర్తి నెగటివ్ షేడ్‌లో కనిపిస్తాడు. పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో తమిళ హీరో అథర్వ మురళి కీలక పాత్ర పోషించాడు.

ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా దర్శకుడు హరీష్ శంకర్ స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేశాడు. మాతృకలో కనిపించిన స్ఫూర్తి ఈ సినిమాలో మిస్ అయినా.. మొదటి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకోవడం గమనార్హం. మరికొంత లోతుల్లోకి వెళ్తే…

వరుణ్ తేజ్ యాక్టింగ్…

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఇప్పటివరకు నెగటివ్ షేడ్‌లో నటించలేదు. తన కెరీర్‌లో అన్నీ లవ్ చిత్రాలు మాత్రమే చేశాడు. మొదటిసారి నెగటివ్ పాత్ర పోషించినా.. చాలా ఈజ్‌తో నటించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘గద్దలకొండ గణేష్’ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. పక్కా మాస్ గ్యాంగ్‌స్టర్‌గా ప్రేక్షకులను మెప్పించి.. సినిమా మొత్తం వన్ మ్యాన్ షో చేశాడని చెప్పవచ్చు.

అథర్వ మురళీ, మృణాళిని రవి లవ్ సీన్స్….

తన సినిమా కోసం ‘గద్దలకొండ గణేష్’ జీవిత చరిత్ర తెలుసుకునే భాగంలో అథర్వ మురళికి, మృణాళినితో పరిచయం ఏర్పడుతుంది. వీళ్లిద్దరి మధ్య వచ్చే ప్రతీ సీన్ ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే హీరోను ఎలివేట్ చేసే క్రమంలో దర్శకుడు వీళ్ళ సీన్స్‌ను కట్ చేశారు. కానీ సగటు ప్రేక్షకుడు మాత్రం వీరిద్దరి మధ్య మరిన్ని సన్నివేశాలు ఉంటే బాగుంటుందని అని భావిస్తున్నారు.

మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతం…

ఫ్యామిలీ సినిమాలకు మిక్కీ జే మేయర్ పెట్టింది పేరు. వినసొంపైన సంగీతంతో చక్కటి బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకులను అలరించేవాడు. ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ సినిమా కూడా చేయలేదు. కానీ ఈ హద్దులన్నీ దాటి ‘గద్దలకొండ గణేష్’కు అదిరిపోయే మాస్ బీట్స్ ఇచ్చాడు. మెలోడీ సాంగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. సంగీతం పరంగా పొరపాటు జరగని ఈ సినిమాకు మ్యూజిక్ ఆరో ప్రాణమని చెప్పవచ్చు.

అథర్వ మురళీ యాక్టింగ్…

అథర్వ మురళి తెలుగు తెరకు ఈ సినిమాతో పరిచయమయ్యాడు. అభిలాష్ పాత్రలో అతడు అద్భుతంగా నటించాడు. అటు ఎమోషనల్ సీన్స్.. ఇటు రొమాంటిక్ సీన్స్‌లో చక్కగా నటించాడు. హేమచంద్ర ఇచ్చిన వాయిస్ కూడా అథర్వకు బాగా సూట్ అయింది.

దర్శకుడి పనితనం….

మాతృకలో కొన్ని మార్పులు చేసి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు హరీష్ శంకర్. అయితే ఆ మార్పుల వల్ల కొంత ఎఫెక్ట్ పడినా.. ఎక్కడా కూడా ఫీల్ మిస్ కాకుండా రియలిస్టిక్‌గా తీర్చిదిద్దాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు బాగున్నాయి. వరుణ్ తేజ్ క్యారెక్టర్ గురించి వేరే చెప్పక్కర్లేదు. సినిమాకు అదే హైలైట్ అయ్యేలా చేశాడు.