45 నిముషాల్లో రూ. 2లక్షల లోన్.. 6 నెలల వరకు నో ఈఎంఐ..

కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. కరోనా లాక్‌డౌన్‌ ప్రభావం మధ్యతరగతి ప్రజలపై ఎక్కువగా చూపిస్తోంది. ఈ కష్టసమయంలో మధ్యతరగతి ప్రజలను ఆదుకునేందుకు

  • Tv9 Telugu
  • Publish Date - 12:29 pm, Mon, 4 May 20
45 నిముషాల్లో రూ. 2లక్షల లోన్.. 6 నెలల వరకు నో ఈఎంఐ..

SBI Emergency Loan: కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. కరోనా లాక్‌డౌన్‌ ప్రభావం మధ్యతరగతి ప్రజలపై ఎక్కువగా చూపిస్తోంది. ఈ కష్టసమయంలో మధ్యతరగతి ప్రజలను ఆదుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ముందుకొచ్చింది. వీరి కోసం ప్రీ అప్రూవ్డ్‌ పర్సనల్‌ లోన్‌ లేదా ఎమర్జెన్సీ లోన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఎమర్జెన్సీ లోన్‌ను ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండానే.. 45 నిమిషాల్లో అందించనున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది.

కాగా.. కోవిద్-19 విజృంభణతో ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. అందుకని ఎస్‌బీఐ బ్యాంకు కస్టమర్లకు శుభవార్త తెలిపింది. ఆరు నెలల తర్వాత ఈ ఈఎంఐ పేమెంట్ మొదలవుతుంది. ఏ సమయంలోనైనా పర్సనల్ ఎమర్జెన్సీ లోన్‌ను తీసుకోవచ్చని ఎస్‌బీఐ చెప్పింది. కరోనా లాక్‌డౌన్ కాలంలో ఇబ్బంది పడుతోన్న ప్రజల కోసం దీన్ని తెచ్చినట్టు ఎస్‌బీఐ తెలిపింది. ఈ ఎమర్జెన్సీ లోన్‌కు ఏడాదికి 7.25 శాతం వడ్డీ వేయనుంది. ఇది సాధారణంగా పర్సనల్‌ లోన్స్‌పై ఇచ్చే విధించే వడ్డీ కంటే చాలా తక్కువ. ప్రస్తుతం ఎస్‌బీఐ పర్సనల్‌ లోన్స్‌ 10.5 శాతం నుంచి 22 శాతం వరకు ఉన్నాయి.

కాగా.. ఈ లోన్ పొందడానికి మీరు అర్హత ఉందా.. లేదా.. తెలుసుకోవడం కోసం.. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి పీఏపీఎల్ అని రాసి స్పేస్ ఇచ్చి, మీ అకౌంట్ నెంబర్ చివరి నాలుగు నెంబర్లు రాసి, 567676కి ఎస్‌ఎంఎస్ చేయాలి. ఇలా పంపాక మీరు పర్సనల్ ఎమర్జెన్సీ లోన్‌కు అర్హులో కాదో బ్యాంక్ చెబుతుంది. నాలుగు ప్రాసెస్‌లో అర్హులైన వారికి లోన్ వస్తుంది. యోనో ఎస్‌బీఐ యాప్‌లో కూడా అవైల్ నౌ అప్షన్లను క్లిక్ చేయాలి. ఆ తర్వాత లోన్ టెన్యూర్‌‌ను, అమౌంట్ సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ మొబైల్ నెంబర్‌‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్‌‌ చేస్తే.. మీ అకౌంట్‌లోకి ఆటోమేటిక్‌గా మనీ క్రెడిట్ అవుతుంది.