పితాని వెంకట సురేష్‌కి హైకోర్టులో చుక్కెదురు‌

ఏపీలో సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ కుంభకోణంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేష్‌కు హైకోర్టులో షాక్ తగిలింది.

పితాని వెంకట సురేష్‌కి హైకోర్టులో చుక్కెదురు‌
Follow us

| Edited By:

Updated on: Jul 13, 2020 | 9:38 PM

ఏపీలో సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ కుంభకోణంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేష్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం సురేష్, ఆయన దగ్గర పనిచేసిన మురళీ మోహన్‌ దాఖలు చేసుకున్న‌‌ పిటిషన్‌‌ను హైకోర్టు తిరస్కరించింది. విచారణలో భాగంగా పితాని, మురళీ తరఫున న్యాయవాది చల్లా అజయ్ కుమార్‌ వాదిస్తూ.. రాజకీయ కక్షతోనే ఈ కేసులో తన పిటిషనర్లను ఇరికించారని వాదించారు. వెంకట సురేష్ ఎప్పుడూ తన తండ్రి పదవిని దుర్వినియోగం చేయలేదని ఆయన పేర్కొన్నారు. అలాగే సురేష్ వద్ద కార్యదర్శిగా ఉన్న మురళీ మోహన్‌కు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని అజయ్‌ కుమార్‌ వెల్లడించారు. అందుకే ఈ కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేయకుండా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని ఆయన అన్నారు.

అయితే ఈ వాదనతో ఏసీబీ తరపు న్యాయవాది విభేదించారు. ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పితాని వెంకట సురేష్‌కి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేశారు. అయితే సురేష్ గత కొన్ని రోజులుగా పరారీలో ఉండగా.. ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇక ఇప్పుడు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ని కొట్టివేయడంతో ఏ క్షణమైనా సురేష్‌ను అరెస్ట్ చేసేందుకు.. ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేశారు. కాగా ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సహా పలువురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!