“ఓపెనింగ్ ఇస్తే ఆస్వాదిస్తా, ఫినిషర్​గా స‌త్తా చాటుతా”

తాను ఓపెనింగ్ బ్యాటింగ్​ను ఎంజాయ్ చేస్తాన‌ని, ఒకవేళ ఆ స్థానం కుదరనప్పుడు ఫినిషర్​గానూ త‌న పాత్ర పోషిస్తాన‌ని క్రికెటర్ అజింక్య రహానె పేర్కొన్నాడు

ఓపెనింగ్ ఇస్తే ఆస్వాదిస్తా, ఫినిషర్​గా స‌త్తా చాటుతా
Follow us

|

Updated on: Aug 27, 2020 | 4:55 PM

తాను ఓపెనింగ్ బ్యాటింగ్​ను ఎంజాయ్ చేస్తాన‌ని, ఒకవేళ ఆ స్థానం కుదరనప్పుడు ఫినిషర్​గానూ త‌న పాత్ర పోషిస్తాన‌ని క్రికెటర్ అజింక్య రహానె పేర్కొన్నాడు. ఐపీఎల్​లో ఢిల్లీ క్యాపిటల్స్​కు మొద‌టిసారి ఆడనున్న ఇతడు.. టీమ్‌లో త‌న స్థానంతో పాటు ట్రైనింగ్, బ్యాటింగ్ తదితర అంశాల‌ గురించి మాట్లాడాడు. టీ20ల్లో 5000ల మార్క్​ను అందుకునేందుకు మరో 12 ర‌న్స్ దూరంలో ఉన్నాడు రహానె.

“ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో​ ఏ స్థానం ఇస్తారో ఇంకా స్ప‌ష్ట‌త లేదు. ప్రాక్టీసు సెషన్స్ స్టార్ట‌యి, వాళ్లతో మాట్లాడితేనే తెలుస్తుంది. కెరీర్​ మొత్తం ఓపెనింగ్ చేస్తూ, దానిని ఎంజాయ్ చేశాను. కానీ ఈ ఐపీఎల్​లో మాత్రం మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయంపై నా బ్యాటింగ్ స్థానం ఆధారపడి ఉంటుంది. వాళ్లు ఏం చేయమన్నా సరే 100 శాతం నా ప్ర‌దర్శ‌న ఇచ్చేందుకు రెడీగా ఉంటా” అని ర‌హ‌నే పేర్కొన్నాడు

ఢిల్లీ టీమ్‌లో ప్ర‌జంట్ శిఖర్ ధావన్, పృథ్వీషా, శ్రేయస్ అయ్యర్, హెట్మయిర్, పంత్ వరుస స్థానాల్లో ఉన్నారు. దీంతో రహానె చివర్లోనే బ్యాటింగ్‌కు దిగాల్సి ఉంటుంది. ఇక ఢిల్లీ టీమ్ కోచ్ రికీ పాంటింగ్​ ఆధ్వర్యంలో చాలా విషయాలు నేర్చుకోవచ్చని చెప్పాడు రహానె. దానికోసం ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. తన ఆట స్థాయిని పెంపొందించుకునేందుకు ఇదే సరైన సమయమని అభిప్రాయ‌ప‌డ్డాడు.

Also Read :

సీమ ప్రాజెక్టులపై జ‌గ‌న్ స‌ర్కార్ కీలక నిర్ణయం

ఇంట్లో నిద్ర‌పోతున్న ముగ్గురు చిన్నారుల‌ను కాటేసిన క‌ట్ల‌పాము

నేష‌న‌ల్ హైవేపై నోట్ల కట్టల క‌ల‌క‌లం

బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!