ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. టోర్నీకి దూరమైన స్టార్ బ్యాట్స్‌మెన్‌..

ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్‌ జాసన్ రాయ్ గాయం కారణంగా మొత్తం టోర్నమెంట్‌కు దూరమయ్యాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. టోర్నీకి దూరమైన స్టార్ బ్యాట్స్‌మెన్‌..
Ravi Kiran

|

Aug 28, 2020 | 12:21 PM

Jason Roy To Miss IPL 2020: ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్‌ జాసన్ రాయ్ గాయం కారణంగా మొత్తం టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ డానియల్ సామ్స్ డీసీ టీంలోకి వచ్చాడు. కాగా, రాయ్‌ను రూ. 1.5 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది. ఓపెనర్‌గా వచ్చి దూకుడుగా ఆడే రాయ్ దూరం కావడం ఢిల్లీకి పెద్ద లోటే అని చెప్పవచ్చు. దీనితో ధావన్, పృథ్వి షా ఓపెనింగ్ చేయనున్నారు. (కరోనా చికిత్స.. ఆ రెండు టాబ్లెట్స్ కలిపి వాడితే ముప్పే..!)

కాగా, ఈ ఏడాది ఐపీఎల్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 54 రోజులు సాగే ఈ లీగ్‌ ఫైనల్ నవంబర్ 10న జరగనుంది. ఇప్పటికే అన్ని టీమ్స్ యూఏఈ చేరుకోగా.. ఆరు రోజుల క్వారంటైన్ తర్వాత సాధన మొదలుపెట్టనున్నాయి. ఇక వారం రోజుల్లోనే ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అబుదాబీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ జాప్యం ఏర్పడిందని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ చెప్పుకొచ్చారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu