ED Focus on Loan App Scams : లోన్​ యాప్​ మోసాలపై ఈడీ స్పెషల్ ఫోకస్.. కూపీ లాగుతున్న అధికారులు..

లోన్​ యాప్​ మోసాలపై ఈడీ దృష్టి పెట్టింది. తెలంగాణ, తమిళనాడులో పలువురు ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో  లోన్​ యాప్​ మోసాలపై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ స్పెషల్ ఫోకస్ పెట్టింది...

  • Sanjay Kasula
  • Publish Date - 10:20 pm, Mon, 4 January 21
ED Focus on Loan App Scams : లోన్​ యాప్​ మోసాలపై ఈడీ స్పెషల్ ఫోకస్.. కూపీ లాగుతున్న అధికారులు..

ED Focus on Loan App Scams : లోన్​ యాప్​ మోసాలపై ఈడీ దృష్టి పెట్టింది. తెలంగాణ, తమిళనాడులో పలువురు ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో  లోన్​ యాప్​ మోసాలపై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే దర్యాప్తు చేపడుతున్న రూ.1,100 కోట్ల ఆన్​లైన్​ బెట్టింగ్​ కుంభకోణం కేసులో భాగంగా లోన్​ యాప్​ మోసాల సంగతి కూడా తేల్చేందుకు రెడీ అవుతోంది.

ప్రజల్ని మోసగించడం, భారీగా డబ్బులు దండుకోవడం, ఆ మొత్తాన్ని అక్రమ మార్గాల్లో చైనా సహా ఇతర దేశాలకు తరలించడంలో ఆన్​లైన్​ బెట్టింగ్​ స్కామ్​, లోన్​ యాప్​లకు సారూప్యత ఉందని ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో నమోదైన ఫిర్యాదులపై ఈడీ దర్యాప్తు చేపట్టనుందని స్పష్టం చేశాయి.

బాకీ చెల్లించమంటూ పలు లోన్​ యాప్​లు చేస్తున్న వేధింపులు భరించలేక తెలంగాణలో ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డడారు. పోలీసులు ఇప్పటివరకు 50 కేసులు నమోదు చేయగా, 29 మందిని అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు చైనీయులు కూడా ఉండటం తెలిసిందే. .

అయితే తమిళనాడు పోలీసులు కూడా స్థానికుల ఫిర్యాదుల మేరకు పలువురని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. చైనాకు చెందిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు.