ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌కి కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటికే సామాన్య ప్రజలతో పాటు ఫ్రంట్ లైన్ వారియన్స్ అయిన వైద్యులు, మెడికల్ స్టాఫ్, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు...

ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌కి కరోనా పాజిటివ్
Follow us

|

Updated on: Oct 08, 2020 | 2:17 PM

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటికే సామాన్య ప్రజలతో పాటు ఫ్రంట్ లైన్ వారియన్స్ అయిన వైద్యులు, మెడికల్ స్టాఫ్, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారినపడ్డారు. ఇప్పటికీ ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కాగా అనేకమంది వ్యాధిపై పోరాడి విజేతలవ్వగా.. మరికొందరు వైరస్‌కు బలయ్యారు. ( తహసీల్దార్ కార్యాలయాల్లో అదనంగా మరో ఇంటర్నెట్ లైన్ )

తాజాగా, వైసీపీ ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కు కరోనా బారినపడ్డారు. కోవిడ్ నిర్ధారణ కావడంతో ఎంపీ శ్రీధర్ హైదరాబాద్ లోని తన ఇంట్లో హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఆయనతో పాటు మరో నలుగురు కార్యాలయ సిబ్బందికి కూడా కరోనా సోకింది. దీంతో గత వారం రోజుల్లో తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎంపీ విజ్ఞప్తి చేసారు.

ప్రభుత్వం బుధవారం రిలీజ్ చేసిన బులిటెన్ ప్రకారం  ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 7,34,427కి చేరింది. ఇందులో 49,513 యాక్టివ్ కేసులు ఉండగా.. 6,78,828 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.  మొత్తం మరణాల సంఖ్య 6,086కు చేరింది. ( చిన్నాన్న ఆస్తి కోసం దారుణం, ఇద్దరు తమ్ముళ్లని రాళ్లతో కొట్టి ! )