Elon Musk: ‘మాట ఇచ్చినట్లే మేము వచ్చేస్తున్నాం’… భారత్‌లోకి టెస్లా రాకపై తొలిసారి స్పందించిన సీఈఓ..

Elon Musk Tweet About Tesla India: అంతర్జాతీయంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఎలక్ట్రానిక్‌ కార్ల కంపెనీ టెస్లా భారత్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లో..

Elon Musk: 'మాట ఇచ్చినట్లే మేము వచ్చేస్తున్నాం'... భారత్‌లోకి టెస్లా రాకపై తొలిసారి స్పందించిన సీఈఓ..
Follow us

|

Updated on: Jan 17, 2021 | 5:34 AM

Elon Musk Tweet About Tesla India: అంతర్జాతీయంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఎలక్ట్రానిక్‌ కార్ల కంపెనీ టెస్లా భారత్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లో విద్యుత్‌ ఆధారంగా నడిచే వాహనాల తయారీపై ప్రాముఖ్యత పెరుగుతుండడం, ప్రభుత్వాలు కూడా రాయితీలు ప్రకటిస్తోన్న నేపథ్యంలో టెస్లా భారత్‌లోకి ప్రవేశించడానికి రంగం సిద్ధం చేసుకుంటోందని గత కొన్ని రోజులుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ వార్తలపై తొలిసారి అధికారికంగా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు ఎలాన్‌ మస్క్‌. త్వరలోనే భారతమార్కెట్‌లోకి టెస్లా ప్రవేశిస్తుందన్న వార్తలను ధృవీకరించారు. ‘అత్యంత ఖరీదైన టెస్లా కార్లు భారతీయ మార్కెట్లో ఎంత వరకు రాణిస్తాయి.. వాటికి ఇండియన్‌ మార్కెట్లో గల అవకాశాలను విశ్లేషిస్తూ పోస్ట్‌ చేసిన ఓ బ్లాగ్‌ పోస్ట్‌పై మస్క్‌ స్పందించారు. ఆ పోస్ట్‌కు రిప్లై ఇస్తూ.. ‘హామీ ఇచ్చినట్టుగానే’ (మేం వచ్చేస్తున్నాం) అనే అర్థం వచ్చేలా కామెంట్‌ చేశాడు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ టెస్లా భారత్‌లో తమ కార్యక్రమాలను ప్రారంభించేందుకు నమోదు చేసుకున్న క్రమంలో ఈ ట్వీట్‌ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే తయారీ ప్లాంట్, ఆర్‌అండ్‌డీ కేంద్రం ఏర్పాటు కోసం టెస్లా.. 5 రాష్ట్రాలతో చర్చిస్తున్నట్లు సమాచారం. భారత్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటర్స్‌తో టెస్లా జట్టు కట్టే అవకాశాలున్నాయంటూ వార్తలు వచ్చినప్పటికీ.. టాటా మోటార్స్‌ ఆ వార్తలను ఖండించింది.

Also Read: Navalben: పాలను అమ్మి రూ.1.10 కోట్లు సంపాదించింది.. రాష్ట్రపతి సాధికారిత గుర్తింపులో మహిళ ‘నవల్‌బెన్‌’

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!