అంబానీ, బఫెట్‌లను దాటేసి.. ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్..

ప్రపంచంలోని కుబేరుల్లో స్పేస్ ఎక్స్ సీఈవో, టెస్లా యజమాని ఎలాన్ మస్క్ చోటు సాధించాడు. ప్రపంచ ఏడో సంపన్నుడిగా అవతరించాడు. దీనికోసం భారత కుబేరుడు ముకేష్ అంబానీ, వారెన్ బఫెట్‌లను ఓవర్‌టేక్ చేశాడు.

అంబానీ, బఫెట్‌లను దాటేసి.. ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్..
Follow us

| Edited By:

Updated on: Jul 11, 2020 | 10:03 PM

Elon Musk: ప్రపంచంలోని కుబేరుల్లో స్పేస్ ఎక్స్ సీఈవో, టెస్లా యజమాని ఎలాన్ మస్క్ చోటు సాధించాడు. ప్రపంచ ఏడో సంపన్నుడిగా అవతరించాడు. దీనికోసం భారత కుబేరుడు ముకేష్ అంబానీ, వారెన్ బఫెట్‌లను ఓవర్‌టేక్ చేశాడు. శుక్రవారం నాడు మస్క్ ఆస్తుల విలువ 6.1 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ప్రపంచ సంపన్నుల్లో ఏడో స్థానానికి చేరాడని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది.

తాజాగా.. 70.5 బిలియన్ డాలర్ల నెట్ వర్త్‌తో గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్, ముకేష్ అంబానీ, వారెన్ బఫెట్‌లను దాటిన మస్క్.. ప్రపంచ ఏడో సంపన్నుడిగా అవతరించాడు. కాగా, ఇటీవలే బెర్క్‌షైర్ హాత్‌వే స్టాక్ చారిటీకి బఫెట్ 2.9బిలియన్ డాలర్ల విరాళం ఇచ్చాడు. దీంతోనే ఆయన నెట్ వర్త్ తగ్గిందని సమాచారం.

Also Read: ఢిల్లీలో తగ్గుతున్న మరణాల రేటు.. హోం ఐసోలేషన్ సేఫ్..