కరోనా స‌మయంలో బక్రీద్ : ‌డ‌బ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలు

దేశ‌వ్యాప్తంగా క‌రోనా వ్యాప్తి తీవ్ర‌త‌రం అవ్వ‌డంతో ముస్లింల ప‌విత్ర పండుగ బక్రీద్‌పై రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌లు మార్గదర్శకాలను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

  • Ram Naramaneni
  • Publish Date - 8:17 am, Fri, 31 July 20
కరోనా స‌మయంలో బక్రీద్ : ‌డ‌బ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలు

Corona impact on Bakrid : దేశ‌వ్యాప్తంగా క‌రోనా వ్యాప్తి తీవ్ర‌త‌రం అవ్వ‌డంతో ముస్లింల ప‌విత్ర పండుగ బక్రీద్‌పై రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌లు మార్గదర్శకాలను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఇళ్ల‌లోనే ప్రార్థ‌న‌లు జ‌ర‌పుకోవాల‌ని, ఆవుల‌ను వ‌ధించ‌వ‌ద్ద‌ని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ సైతం కోరారు. కాగా తాజాగా డ‌బ్ల్యూహెచ్ఓ సైతం బ‌క్రీద్ పండుగ నేప‌థ్యంలో మార్గదర్శకాలు జారీ చేసింది

భౌతికదూరం పాటించ‌డంతో పాటు, శానిటైజర్లు, మాస్కుల వాడకం త‌ప్ప‌నిస‌రి అని పేర్కొంది. అంతేగాకుండా జంతు వధ సందర్భంగా కూడా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించింది. అనారోగ్యంతో ఉన్న గొర్రెలను, ఇతర జంతువులను వధించరాదని కోరింది. ఇళ్ల వద్ద జంతు వధ చేయ‌కూడ‌ద‌ని తెలిపింది. జంతువులు అస్వస్థతతో ఉంటే వాటిని ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. ఇప్పుటివ‌రకు ఉన్న స‌మాచారం ప్రకారం, మనుషులను ఇన్ఫెక్షన్‌కు గురిచేసే కరోనా వైరస్ జంతువులను కూడా సోకే అవ‌కాశం ఉంది. కాగా జంతువుల నుంచి నేరుగా మనుషులకు కోవిడ్-19 వ్యాప్తి చెందుతుంద‌న్న విష‌యంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, జీవాల నుంచి ఇతర వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఉన్నందున జాగ్ర‌త్త‌లు త‌ప్స‌నిస‌రి అని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది.

మ‌రికొన్ని సూచ‌న‌లు :

  • బక్రీద్ సందర్భంగా ఒకరినొకరు భౌతికంగా తాకే ప‌ద్ద‌తిలో పరస్పర శుభాకాంక్షలు తెలుపుకోకూడ‌దు.
  • అందుకు బ‌దులుగా విభిన్న మార్గ‌ల్లో… చేయి ఊపడం, హృదయంపై చేయి ఆన్చడం ద్వారా కూడా విషెస్ తెల‌పొచ్చు.
  • పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు ఒకేచోట గుమికూడకుండా ఎవ‌రి ఇళ్ల‌ల్లో వాళ్లే ప్రార్థ‌నలు జ‌రుపుకోవాలి.
  • మసీదులు, దుకాణాలు, మార్కెట్లలో జనం గుమిగూడకుండా చూడాలి

Read More : రివ్యూ: ఉమామహేశ్వర ఉగ్రరూపస్య