ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో.. యూపీ సీఎంకు ఈసీ షోకాజ్‌ నోటీసు

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఎన్నికల సంఘం (ఈసీ) షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఉగ్రవాదులకు బిర్యానీ అందిస్తున్నారంటూ యోగి చేసిన వ్యాఖ్యలకు గాను ఈ నోటీసులిచ్చింది. ఫిబ్రవరి 8 జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమలు చేసిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనలను ఉల్లంఘించారని ఈ సీ పేర్కొంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల్లోగా దీనిపై సమాధానం ఇవ్వాలని పేర్కొంది. షాహిన్‌బాగ్‌ ఆందోళనలకు ఆప్‌ సహకరిస్తోందని ఫిబ్రవరి 1న జరిగిన ప్రచార సభలో యోగి […]

ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో.. యూపీ సీఎంకు ఈసీ షోకాజ్‌ నోటీసు
Follow us

| Edited By:

Updated on: Feb 07, 2020 | 4:36 AM

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఎన్నికల సంఘం (ఈసీ) షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఉగ్రవాదులకు బిర్యానీ అందిస్తున్నారంటూ యోగి చేసిన వ్యాఖ్యలకు గాను ఈ నోటీసులిచ్చింది. ఫిబ్రవరి 8 జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమలు చేసిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనలను ఉల్లంఘించారని ఈ సీ పేర్కొంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల్లోగా దీనిపై సమాధానం ఇవ్వాలని పేర్కొంది.

షాహిన్‌బాగ్‌ ఆందోళనలకు ఆప్‌ సహకరిస్తోందని ఫిబ్రవరి 1న జరిగిన ప్రచార సభలో యోగి తెలియపరు. ఉగ్రవాదులకు బిర్యానీలు అందజేస్తున్నారంటూ విమర్శించారు. మరోవైపు దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార గడువు గురువారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. 70 స్థానాలకు ఈ నెల 8న ఎన్నికలు పోలింగ్‌ జరగనుండగా.. 11న ఫలితాలు వెలువడనున్నాయి.

[svt-event date=”07/02/2020,12:43AM” class=”svt-cd-green” ]

[/svt-event]