AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొయ్యి లేకుండానే ఒంటిని చల్లబరిచే అద్భుతమైన డ్రింక్.. జస్ట్ 5 నిమిషాల్లోనే రెడీ..

వేసవి తాపాన్ని తగ్గించే మ్యాంగో లస్సీని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. మామిడి పండ్ల గుజ్జు, పాలు, పెరుగు, మిల్క్ మేడ్ కలిపి చేసే ఈ శీతల పానీయం పొయ్యి లేకుండానే సిద్ధం అవుతుంది. ఈ రెసిపీ వేసవిలో తీపి, పుల్లని రుచుల కలయికతో శరీరాన్ని చల్లబరుస్తుంది. శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే మ్యాంగో లస్సీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి..

పొయ్యి లేకుండానే ఒంటిని చల్లబరిచే అద్భుతమైన డ్రింక్.. జస్ట్ 5 నిమిషాల్లోనే రెడీ..
Mango Lassi Recipe
Shaik Madar Saheb
|

Updated on: May 23, 2026 | 5:21 PM

Share

ఎండలు దుమ్మురేపుతున్నాయి.. చాలా ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. వేడి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శరీరాన్ని చల్లబరచడానికి, దాహాన్ని తీర్చడానికి మ్యాంగో లస్సీ ఒక అద్భుతమైన పానీయం.. ఈ మ్యాంగో లస్సీ రెసిపీని ఎవరైనా ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. పండిన మామిడి పండ్లతో చేసే ఈ లస్సీ వేసవిలో ప్రత్యేక ఆకర్షణ. ఈ రెసిపీ తయారీకి పొయ్యి అవసరం లేకుండానే పూర్తి అవుతుంది.. ఇదే మామిడి లస్సీ ప్రత్యేకత..

మ్యాంగో లస్సీ తయారీకి అవసరమైన పదార్థాలు: మామిడి పండ్ల గుజ్జు, పాలు, మిల్క్ మేడ్ (కండెన్స్‌డ్ మిల్క్), పెరుగు.

ముందుగా రెండు బాగా పండిన మామిడి పండ్లను తీసుకుని వాటి గుజ్జును సిద్ధం చేసుకోవాలి. మామిడి పల్ప్‌ను ఇంట్లోనే మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు.. దీనికి షుగర్ లేదా నీరు కలపవలసిన అవసరం లేదు.

తయారీ విధానం:

ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో తగినంత పాలను పోయాలి. చాలా మంది లస్సీలో పాలు వాడాలా అని సందేహిస్తారు.. కానీ క్రీమీ టెక్స్చర్ కోసం పాలు అవసరం. ఇప్పుడు పాలలో, ముందుగా సిద్ధం చేసుకున్న మామిడి పండ్ల గుజ్జును కలపాలి. ఒక విస్కర్‌తో లేదా స్పూన్‌తో పాలు, మామిడి గుజ్జు పూర్తిగా కలిసిపోయేలా బాగా కలపాలి.

ఈ మిశ్రమంలో ఇప్పుడు చిక్కటి పెరుగును కలపాలి. పెరుగును నీరు కలపకుండా గట్టిగా, క్రీమ్ లా ఉండేలా చూసుకోవాలి. ఇది లస్సీకి మంచి చిక్కదనాన్ని, పుల్లని రుచిని ఇస్తుంది. తీపి కోసం మిల్క్ మేడ్ (కండెన్స్‌డ్ మిల్క్)ను చేర్చాలి. మిల్క్ మేడ్ లస్సీకి తీపితో పాటు మంచి క్రీమీ ఫ్లేవర్‌ను ఇస్తుంది. సాధారణంగా మూడు స్పూన్ల మిల్క్ మేడ్ సరిపోతుంది.. అయితే మీ తీపికి తగ్గట్టుగా దీని పరిమాణాన్ని మార్చుకోవచ్చు.

అన్ని పదార్థాలను మళ్లీ బాగా కలిపిన తర్వాత, లస్సీ క్రీమీగా, నునుపుగా మారినట్లు నిర్ధారించుకోవాలి. ఈ మిశ్రమం సిద్ధం కాగానే, వెంటనే గ్లాసుల్లోకి తీసుకుని సేవించవచ్చు. ఈ శీతల పానీయం వేసవి తాపాన్ని తగ్గిస్తుంది. మామిడి పండ్ల రుచిని ఆస్వాదించడానికి ఒక రుచికరమైన మార్గం. ఇక్కడ అందించిన ఈ సులభమైన రెసిపీతో ఇంటి వద్దే రుచికరమైన మ్యాంగో లస్సీని తయారు చేసుకుని వేసవిని ఆస్వాదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us