తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. ఈ ఆఫీస్ ద్వారా పరిపాలనకు శ్రీకారం

తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. ఈ ఆఫీస్ ద్వారా పరిపాలనకు శ్రీకారం

కరోనా మహ‌మ్మారి వీర‌విహారం చేస్తోన్న ప్రస్తుత నేపథ్యంలో తెలంగాణ‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంతో సహా ఇతర హెచ్ఓడీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ ద్వారా సులభతర పరిపాలన మొదలుపెట్టబోతోంది.

Ram Naramaneni

|

Jul 06, 2020 | 10:47 AM

-కరోనా నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం -వచ్చేవారం నుంచి ఈ ఆఫీస్ ద్వారా సులభతర పరిపాలన -ప్రతిశాఖకు ఒక నోడల్ అధికారి, సాంకేతిక సహాయకుడు -రేపటిలోగా ఉద్యోగుల మాస్టర్ డేటా -ముద్ర సాఫ్ట్ వేర్ ద్వారా డిజిటల్ సంతకాల సేకరణ -ఈ ఆఫీస్ పై ఉద్యోగులకు త్వరలో శిక్షణ -ఈ ఆఫీస్ కోసం అధికారుల హైరార్కీ మ్యాపింగ్

కరోనా మహ‌మ్మారి వీర‌విహారం చేస్తోన్న ప్రస్తుత నేపథ్యంలో తెలంగాణ‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంతో సహా ఇతర హెచ్ఓడీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ ద్వారా సులభతర పరిపాలన మొదలుపెట్టబోతోంది. రేపటిలోగా ఉద్యోగుల మాస్టర్ డేటా బేస్ రూపొందించాలని, ఈ ఆఫీస్ కు అవసరమయ్యే సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ల వివరాలు, డిజిటల్ సంతకాలను సేకరించాలని వివిధ శాఖలకు నోట్ జారీ చేసింది. ఈ ఆఫీస్ నిర్వహణ కోసం 6 వ తేదీలోగా ప్రతిశాఖకు ఒక నోడల్ అధికారిని, సాంకేతిక సహాయకుడిని కూడా నియమించే విధంగా ఆదేశాలిచ్చింది. జూలై రెండోవారం నుంచి ఈ ఆఫీస్ ద్వారా పరిపాలన మొదలుపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu