‘అవును, వచ్చింది, పోయింది, హాలీవుడ్ కండల వీరుడు డ్వానే జాన్సన్

హాలీవుడ్ నటుడు, కండలవీరుడు డ్వానే జాన్సన్ తనకు, తన కుటుంబానికి కరోనా వైరస్ సోకి....పోయిందని తెలిపాడు. దాదాపు రెండున్నర వారాల క్రితం తనతో సహా తన భార్య లారెన్ కి, తమ కూతుళ్ళకు కోవిడ్-19 సోకిందని.....

'అవును, వచ్చింది, పోయింది, హాలీవుడ్ కండల వీరుడు డ్వానే జాన్సన్
Umakanth Rao

| Edited By: Team Veegam

Sep 15, 2020 | 8:15 PM

హాలీవుడ్ నటుడు, కండలవీరుడు డ్వానే జాన్సన్ తనకు, తన కుటుంబానికి కరోనా వైరస్ సోకి….పోయిందని తెలిపాడు. దాదాపు రెండున్నర వారాల క్రితం తనతో సహా తన భార్య లారెన్ కి, తమ కూతుళ్ళకు కోవిడ్-19 సోకిందని, ఎంతో క్రమశిక్షణగా ఆరోగ్యాన్ని కాపాడుకున్నా పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నాడు. అయితే ఇప్పుడు పూర్తిగా కోలుకున్నామని..’థాంక్ గాడ్ ! వుయ్ ఆర్ హెల్దీ’.. అంటూ ఈ ‘జుమాన్ జీ ‘ మూవీ స్టార్ తన ఇన్ స్టా గ్రామ్ లో ప్రకటించాడు. తీవ్రమైన గాయాలకన్నా ఈ కోవిడ్ పాజిటివ్ టెస్టింగ్ అన్నది పూర్తి తేడాగా ఉంది.. నేను ఎన్నోసార్లు గాయపడినా, ఇది మరోలా ఉంది’ అని అన్నాడు. నా కుటుంబాన్ని సదా రక్షించుకోవాలన్నదే నా ప్రయారిటీ అని తెలిపాడు. తమ సన్నిహిత కుటుంబ మిత్రుల నుంచి బహుశా ఈ వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నామన్నాడు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu