కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి.. రాజరాజేశ్వరీదేవి అవతారంలో దుర్గమ్మ

శరన్నవరాత్ర ఉత్సవాలు చివరి రోజు కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరుగుతోంది. విజయదశమిని పురస్కరించుకుని అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తున్నారు. రాక్షసులను సంహరించి లోకానికి శాంతి సౌభాగ్యాలు ప్రసాధించినందుకు గుర్తుగా విజయదశమిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. మరోవైపు భవానీ దీక్ష చేపట్టిన భక్తులు కూడా పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం రావడంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. దుర్గామాత నామస్మరణలతో ఆలయం మారుమోగుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా […]

కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి.. రాజరాజేశ్వరీదేవి అవతారంలో దుర్గమ్మ
Follow us

| Edited By:

Updated on: Oct 08, 2019 | 7:10 AM

శరన్నవరాత్ర ఉత్సవాలు చివరి రోజు కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరుగుతోంది. విజయదశమిని పురస్కరించుకుని అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తున్నారు. రాక్షసులను సంహరించి లోకానికి శాంతి సౌభాగ్యాలు ప్రసాధించినందుకు గుర్తుగా విజయదశమిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. మరోవైపు భవానీ దీక్ష చేపట్టిన భక్తులు కూడా పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం రావడంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. దుర్గామాత నామస్మరణలతో ఆలయం మారుమోగుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు దగ్గరుండి చూసుకుంటున్నారు. అమ్మవారికి గారెలు, బెల్లం కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించారు.

ఇక నేడు సాయంత్రం 5 గంటలకు.. కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. హంస వాహన సేవలో గంగ, పార్వతి (దుర్గ) సమేత మల్లేశ్వరస్వామిని మూడుసార్లు జలవిహారం చేయించనున్నారు. ఆ తర్వాత శమపూజతో దసరా ఉత్సవాలు ముగియనున్నాయి.