ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల

ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల బిల్లులను జగన్ సర్కార్ క్లియర్ చేసింది.  సెప్టెంబర్ మొదటి వారం వరకు ఉన్న బిల్లుల మొత్తం చెల్లిస్తూ...

  • Ram Naramaneni
  • Publish Date - 7:25 am, Wed, 14 October 20
ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల

ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల బిల్లులను జగన్ సర్కార్ క్లియర్ చేసింది.  సెప్టెంబర్ మొదటి వారం వరకు ఉన్న బిల్లుల మొత్తం చెల్లిస్తూ ఆదేశాలిచ్చినట్లు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ డాక్టర్ ఎ.మల్లిఖార్జున వెల్లడించారు. 573 ఆస్పత్రులకు రూ.148.37 కోట్లు రిలీజ్ చేసినట్లు తెలిపారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీంకు రూ.31.97 కోట్లు విడుదల చేసి ఆస్పత్రుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. 544 ఆస్పత్రులకు జులై నెల వరకు ఉన్న బకాయిలు చెల్లింపులు జరిగాయని స్పష్టం చేశారు.

Also Read :

Alert : ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

మరో రెండు, మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో అతి భారీవర్షాలు !