దుబ్బాక ఉపఎన్నికకు షెడ్యూల్.. న‌వంబ‌ర్ 3న పోలింగ్

మెద‌క్ జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుద‌లైంది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది.

  • Balaraju Goud
  • Publish Date - 2:06 pm, Tue, 29 September 20
దుబ్బాక ఉపఎన్నికకు షెడ్యూల్.. న‌వంబ‌ర్ 3న పోలింగ్

మెద‌క్ జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుద‌లైంది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. న‌వంబ‌ర్ 3న పోలింగ్ నిర్వ‌హించ‌నున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. నవంబర్ 10న కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికకు అక్టోబ‌ర్ 9న నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. నామినేష‌న్ల దాఖలు చేసేందుకు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 16. దాఖలైన నామినేష‌న్ల‌ను అక్టోబర్ 17న ప‌రిశీలించనున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 19. కాగా, దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి అనారోగ్యం కారణంగా మ‌ర‌ణించడంతో దుబ్బాక ఉప ఎన్నిక అనివార్య‌మైంది. దీంతో ఖాలీ అయిన ఎమ్మెల్యే స్థానానికి ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నిక‌ల షెడ్యూల్‌ను ప్ర‌క‌టించ‌డంతో నేటి నుంచి దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రానుంది. ఇప్పటికే అయా పార్టీలు తమ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.