విశాఖలో డ్రగ్స్ కలకలం

విశాఖలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్‌ ముఠా చెలరేగిపోతోంది. తాజాగా తెన్నేటి పార్కు సమీపంలో వర్మరాజు అనే యువకుడిని అరిలోవ పోలీసులు అరెస్టు చేశారు.

విశాఖలో డ్రగ్స్ కలకలం
Follow us

|

Updated on: Sep 10, 2020 | 5:12 PM

విశాఖలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్‌ ముఠా చెలరేగిపోతోంది. తాజాగా తెన్నేటి పార్కు సమీపంలో వర్మరాజు అనే యువకుడిని అరిలోవ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 5 ఎల్‌ఎల్‌ బ్లాట్స్‌, 200 మిల్లీగ్రాముల MDMA, 200 గ్రాముల గంజాయి, ఓ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వర్మరాజు సివిల్ ఇంజినీరింగ్‌ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

స్నేహితుడి నుంచి వర్మరాజు డ్రగ్స్‌ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వర్మరాజు స్నేహితులను కూడా విశాఖ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.హైదరాబాద్‌ నుంచి డ్రగ్స్‌ దిగుమతి చేస్తున్నట్లు విశాఖ ఏసీపీ మూర్తి తెలిపారు. ఓ గ్యాంగ్ కాలేజీ విద్యార్థులకు ఈ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని అన్నారు.

విశాఖలో చాలా రోజులుగా ఈ ముఠా ఇంజినీరింగ్ విద్యార్థులే టార్గెట్‌గా డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు సూచించారు. కొద్దిరోజుల క్రితమే సెక్స్ రాకెట్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేయగా.. తాజాగా డ్రగ్స్ దందా కలకలం రేపింది. దీంతో పోలీసులు విశాఖ నగరంపై మరింత నిఘా పెంచారు. కొద్దిరోజులుగా ఈ డ్రగ్స్ గ్యాంగ్‌లు సైలెంట్ అయ్యాయి.. మళ్లీ ఇప్పుడు డ్రగ్స్ బయటపడటం కలకలంరేపుతోంది.