క్రేజీ క్రియేటివిటీ.. గాలిలో ఎగురుతూ వచ్చిన మంగళసూత్రం.. తీసుకు వచ్చింది ఎవరో తెలుసా.. వైరల్ అవుతున్న వీడియో

డ్రోన్ వాడకం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. ఎక్కడ చూసిన డ్రోన్ లు గాలిలో ఎగురుతూ కనిపిస్తున్నాయి. పెళ్ళివీడియోలు తీయడానికి కూడా డ్రోన్స్ ను..

  • Rajeev Rayala
  • Publish Date - 3:13 pm, Sun, 17 January 21
క్రేజీ క్రియేటివిటీ.. గాలిలో ఎగురుతూ వచ్చిన మంగళసూత్రం.. తీసుకు వచ్చింది ఎవరో తెలుసా.. వైరల్ అవుతున్న వీడియో

Drone delivers mangalsutra : డ్రోన్ వాడకం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. ఎక్కడ చూసిన డ్రోన్ లు గాలిలో ఎగురుతూ కనిపిస్తున్నాయి. పెళ్ళివీడియోలు తీయడానికి కూడా డ్రోన్స్ ను ఉపయోగిస్తున్నారు. కొంతమంది డ్రోన్స్ తో అద్భుతమైన విజువల్స్ తీయడమే కాకుండా క్రేజీ పనులకు కూడా వాడుతున్నారు. సాధారణంగా పెళ్లిళ్లలో వరుడికి తాళిని పురోహితులు అందిస్తారు. కానీ ఓ పెళ్ళిలో పెళ్ళికొడుకుకి డ్రోన్ తాళిని అందించింది.

ఉడుపి జిల్లాలోని కర్కాల ప్రాంతంలో శనివారం జరిగిన ఓ క్రైస్తవ వివాహంలో డ్రోన్​ ఇలా మంగళసూత్రాన్ని అందించింది. గాల్లోంచి మంగళ సూత్రం తీసుకొచ్చి స్టేజీపైన ఉన్న వరుడికి అందించింది. అతడు ఆ తాళిని వధువు మెడలో కట్టాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో  హల్ చల్ చేస్తుంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.