విద్యార్థులకు గుడ్ న్యూస్… ఈ రోజు ‘దోస్త్‌’ నోటిఫికేషన్

డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి రెడీ అయ్యింది. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్‌-2020 (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ)నోటిఫికేషన్‌ను ఈ రోజు విడుదల చేయనున్నారు

విద్యార్థులకు గుడ్ న్యూస్... ఈ రోజు ‘దోస్త్‌’ నోటిఫికేషన్
Follow us

|

Updated on: Aug 20, 2020 | 1:00 PM

Dost Notification Shortly : డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి రెడీ అయ్యింది. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్‌-2020 (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ)నోటిఫికేషన్‌ను ఈ రోజు విడుదల చేయనున్నారు అధికారులు. దోస్త్-2020 ద్వార.. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాల్లోని వెయ్యికి పైగా ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో సీట్లను నింపనున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారం దోస్త్‌ వెబ్‌సైట్ https://dost.cgg.gov.in లో ఉంచనున్నారు.

ఈసారి ప్రైవేట్‌ కళాశాలల్లో యాజమాన్య కోటా 30 శాతం ఇవ్వాలని ప్రతిపాదన పంపినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఆమోదం రాలేదు. అయితే అలాగే 10 శాతం ఈడబ్ల్యూఎస్ (EWS)‌ కోటా సీట్లకు కూడా జీవో రాకపోవడంతో ఈ విద్యా సంవత్సరానికి అవి అమలవుతాయా? లేదా? అన్న దానిపై స్పష్టత రాలేదు. అధికారులు మాత్రం ప్రతిపాదన పంపామని, ప్రభుత్వ ఆమోదం రావాలని అంటున్నారు.  ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఇతర ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు ఈ రోజు (గురువారం) విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి చర్చించిన అనంతరం ప్రకటించనున్నారు.