Google: గూగుల్ లో అమ్మాయిలు ఎక్కువగా వేటిని వెతుకుతున్నారో తెలుసా..

మనకు ఏ సమాచారం కావాలన్నా గూగుల్(Google) ను అడిగేస్తాం. చిన్నచిన్న అనుమానాలను క్లారిటీగా తెలుసుకోవచ్చు. తెలియని విషయం గురించి తెలుసుకోవడానికి ఇబ్బందులు పడాల్సిన పని లేదు. జస్ట్.. గూగుల్ లో మనకు కావాల్సిన సబ్జె్క్ట్ ను...

Google: గూగుల్ లో అమ్మాయిలు ఎక్కువగా వేటిని వెతుకుతున్నారో తెలుసా..
Follow us

|

Updated on: Apr 25, 2022 | 10:31 AM

మనకు ఏ సమాచారం కావాలన్నా గూగుల్(Google) ను అడిగేస్తాం. చిన్నచిన్న అనుమానాలను క్లారిటీగా తెలుసుకోవచ్చు. తెలియని విషయం గురించి తెలుసుకోవడానికి ఇబ్బందులు పడాల్సిన పని లేదు. జస్ట్.. గూగుల్ లో మనకు కావాల్సిన సబ్జె్క్ట్ ను టైప్ చేస్తే సరిపోతుంది. ఆ అంశానికి సంబంధించిన సమాచారం అంతా మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. అయితే తాజాగా గూగుల్ ఇటీవలే ఒక సర్వే రిపోర్ట్(Google Survey Report) ను విడుదల చేసింది. ఈ రిపోర్టులో మహిళలు ఎక్కువగా ఏ విషయాలను గూగుల్ లో సెర్చ్ చేస్తారు అనేది వెల్లడించింది. 15 కోట్ల ఇంటర్నెట్ యూజర్లలో దాదాపు 6 కోట్ల మంది మహిళలే ఉన్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది మహిళలు ఇంటర్నెట్ ను వాడతున్నారు. చక్కగా జీవితాన్ని మార్చుకోవడానికి, కొత్త విషయాలని తెలుసుకోవడానికి, రానివి నేర్చుకోవడానికి ఇలా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇంటర్నెట్ ని వాడుతున్నారు. ఇలా ఇంటర్నెట్ ని వాడే వారిలో 75 శాతం మంది వయసు 15 నుండి 34 వరకు ఉంటుంది. మరి వారు ఎలాంటివి సెర్చ్ చేస్తున్నారో ఇప్పుడే చూసేద్దాం.

మహిళలకు గోరింటాకు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకింగా చెప్పక్కర్లేదు. గూగుల్ కూడా ఈ విషయాన్ని చెప్పేసింది. ఎక్కువ మంది గోరింటాకు డిజైన్లు గురించి సెర్చ్ చేస్తారట. అలాగే అమ్మాయిలకు పాటలు అంటే కూడా ఇష్టం. అమ్మాయిలు ఎక్కువగా రొమాంటిక్ పాటలు, రొమాంటిక్ కవితల కోసం వెతుకుతున్నారట. అదే విధంగా అందరి కంటే భిన్నంగా ఉండడం కోసం.. అందాన్ని మెరుగు పరచుకోవడం కోసం.. ఇంటర్నెట్ ని చాలా మంది అమ్మాయిలు వాడుతున్నట్లు గూగుల్ రిపోర్ట్ వెల్లడించింది.

ఆన్లైన్ షాపింగ్ సైట్ లను కూడా అమ్మాయిలు ఎక్కువగా చూస్తారు. బట్టలు, డిజైన్లు, కొత్త కలెక్షన్స్ వంటి వాటిని కూడా అమ్మాయిలు సెర్చ్ చేస్తారు. ఏ కెరీర్ ఎంచుకోవాలి, ఏ కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా అమ్మాయిలు వెతుకుతూ ఉంటారు అని గూగుల్ రిపోర్ట్ చెప్పింది.

Also Read

 సింహాన్ని రఫ్ఫాడించిన గేదెలు.. దెబ్బకు తోక ముడుచుకుందిగా.. చూస్తే మైండ్ బ్లాంకే!