దేశాన్ని బీజేపీ అప్రకటిత ఎమర్జన్సీలోకి నెట్టేసింది: స్టాలిన్

ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కామెంట్స్ తో తమిళనాట రాజకీయాలు వేడేక్కాయి. నడ్డాపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జాతీయ సమైక్యతకు, తమిళ సంస్కృతికి బీజేపీ శత్రువు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దేశాన్ని బీజేపీ అప్రకటిత ఎమర్జన్సీలోకి నెట్టేసింది: స్టాలిన్
Follow us

|

Updated on: Aug 25, 2020 | 3:01 PM

ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కామెంట్స్ తో తమిళనాట రాజకీయాలు వేడేక్కాయి. నడ్డాపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జాతీయ సమైక్యతకు, తమిళ సంస్కృతికి బీజేపీ శత్రువు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తోందని మండిపడ్డారు. డీఎంకే లక్ష్యంగా తోలుబొమ్మను ఆడించినట్టు అధికార అన్నాడీఎంకేను ఆడిస్తోందని విమర్శించారు. తమ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా, అభివృద్ధి, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన పార్టీ తమదని, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ముందుంటామన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జన్సీ అమలు చేసేందుకు బీజేపీ ప్రశ్నిస్తోందని స్టాలిన్ ఆరోపించారు.

ఇదిలావుంటే, తమిళనాడు బీజేపీ నిర్వహించిన వర్చువల్ మీట్‌లో సోమవారం పాల్గొన్న జేపీ నడ్డా.. జాతీయ భావ స్ఫూర్తికి వ్యతిరేకంగా డీఎంకే వ్యవహార శైలి ఉందంటూ విమర్శించారు. జాతీయ ప్రధాన స్రవంతిలో కలవాలనుకునే వారికి ఆ పార్టీ ఎప్పుడూ ఆటంకం కలిగిస్తూనే ఉందని మండిపడ్డారు. ఆ పార్టీ అభివృద్ధి నిరోధక పార్టీ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన స్టాలిన్ తాజాగా కౌంటర్ ఇచ్చారు. తమిళ సంస్కృతికి బీజేపీ శత్రువు అంటూ విరుచుకుపడ్డారు.