వాడికి ఉరేస్తేనే మాకు ఆత్మసంతృప్తి.. దివ్య పేరెంట్స్ సంచలన కామెంట్స్

వాడికి ఉరేస్తేనే మాకు ఆత్మసంతృప్తి.. దివ్య పేరెంట్స్ సంచలన కామెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన దివ్య తేజస్విని హత్య కేసును త్వరిత గతిన దర్యాప్తు చేయాలని కోరుతున్నారు మృతురాలి తల్లిదండ్రులు. తామెంతో ప్రేమగా పెంచుకున్న దివ్య తేజస్వినిని...

Rajesh Sharma

|

Nov 08, 2020 | 1:55 PM

Divya parents sensational comments: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన దివ్య తేజస్విని హత్య కేసును త్వరిత గతిన దర్యాప్తు చేయాలని కోరుతున్నారు మృతురాలి తల్లిదండ్రులు. తామెంతో ప్రేమగా పెంచుకున్న దివ్య తేజస్వినిని పథకం ప్రకారం దారుణంగా హత్య చేసిన నాగేంద్రకు ఉరి తీస్తేనే తమకు ఆత్మసంతృప్తి కలుగుతుందంటున్నారు.

‘‘ ప్రధాన నిందితుడు నాగేంద్ర కేసు నుంచి తప్పించు కోవాలని ప్రయత్నం చేస్తున్నాడు.. తమ‌ కూతురిపై అసత్య ఆరోపణలు చేయడం తప్పు.. దివ్య తేజస్విని హత్య కేసును వేగవంతంగా దర్యాప్తు చేయాలి.. నాగేంద్రకు ఉరిశిక్ష విధిస్తేనే దివ్య ఆత్మకు శాంతి‌ కలుగుతుంది.. మాకు కడుపు కోత కొంతైనా తగ్గుతుంది.. ’’ అని అంటున్నారు దివ్య తేజస్విని పేరెంట్స్.

‘‘ దివ్య, నాగేంద్రల ప్రేమ, పెళ్లి వ్యవహారం మా దృష్టికి రాలేదు.. వాళ్ల ప్రేమ వ్యవహారం మాకు తెలిసి దాచామన్నది అవాస్తవం.. దివ్య వ్యక్తిత్వం గురించి మాకు అవగాహన‌ ఉంది.. నాగేంద్ర ఉద్దేశ్యపూర్వకంగానే దివ్యను కిరాతకంగా హత్య చేసాడు.. కేసు విచారణ పూర్తైతే వాస్తవాలు బయటకొస్తాయి.. దివ్య తేజస్వినిలాగా మరో యువతి బలవకుండా నాగేంద్రకు కఠిన శిక్ష పడాలి..’’ అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ALSO READ: పార్టీ స్టాండ్‌కు వ్యతిరేకంగా టీడీపీ నేత ఫ్లెక్సీలు

ALSO READ: శ్రీవారి భక్తులకు డబుల్ గుడ్‌న్యూస్

ALSO READ: రెచ్చిపోయిన బైక్ రైడర్.. ఒకరి మృతి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu