ఉదయ్ కిరణ్‌ చావుకు ఆ అగ్ర హీరోకి సంబంధం లేదు.. తేల్చిచెప్పిన తేజ!

హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు దర్శకుడు తేజ. ఉదయ్ చావుకూ.. ఆ అగ్ర హీరోకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఉదయ్ కిరణ్.. తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం..

  • Tv9 Telugu
  • Publish Date - 9:01 pm, Tue, 5 May 20
ఉదయ్ కిరణ్‌ చావుకు ఆ అగ్ర హీరోకి సంబంధం లేదు.. తేల్చిచెప్పిన తేజ!

హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు దర్శకుడు తేజ. ఉదయ్ చావుకూ.. ఆ అగ్ర హీరోకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఉదయ్ కిరణ్.. తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. ‘చిత్రం’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ లవర్‌ బయ్.. వరుస హిట్లతో మంచి పేరుతో పాటు ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వెండితెర ఎంట్రీ ఇచ్చి హీరోగా రాణించిన ఉదయ్ జీవితం ఎంతో మందికి ఆరద్శం. కానీ ఈ లవర్ బయ్ కెరీర్‌లో ఎంత త్వరగా రీచ్ అయ్యాడో.. అంతే త్వరగా డౌన్ కూడా అయ్యాడు.

ఒకానొక సమయంలో టాలీవుడ్‌లో ఛాన్సులు లేక చాలా ఇబ్బందులు పడ్డ ఈ యువ హీరో జీవితంలోనూ విఫలమై 2014 జనవరి 5వ తేదీన ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. అయితే ఉదయ్ కిరణ్ సినీ కెరీర్ విఫలం వెనుక ఎన్నో రూమర్లు వినిపించినా.. అందుకు సాక్ష్యాలు లేవు. ఏదేమైనా అప్పట్లో అతడి మరణం అందరి మనసునూ కదిలించింది. అయితే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వెనుక అసలు కారణాలు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు డైరెక్టర్ తేజ.

ఉదయ్ చాలా అమాయకుడని.. చాలా మంచివాడని.. ఇండస్ట్రీలో పరిస్థితులు అర్థం చేసుకోలేక చనిపోయాడని అన్నారు. ఉదయ్‌కి పర్సనల్ లైఫ్‌లో కూడా ఇబ్బందులు ఉన్నాయని, వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని కారణాల వల్లే ఈ కుర్రాడికి సమస్యలు తెచ్చాయన్నారు. నిజానికి ‘ఔనన్నా కాదన్నా’ సినిమాకి ముందే ఓ సారి ఆత్మహత్యకు ప్రయత్నించాడన్న విషయాన్ని కూడా వెల్లడించారు తేజ. అప్పుడే ఆపి సినిమా చేశానని.. అయితే ఆ తర్వాత మాత్రం కుదర్లేదని తెలిపారు. ఏదేమైనా ఓ మంచి మనిషిని కోల్పోవడం బాధ కలిగించిందన్నారు. అంతేగానీ ఓ అగ్ర నటుడి కారణంగానే ఉదయ్ కిరణ్ చనిపోయాడనేది మాత్రం ఫేక్ అంటూ కొట్టిపారేశారు తేజ.

Read More:

బ్రేకింగ్: దేశవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన కేంద్రం

తెలంగాణలో జూన్ 12 నుంచి స్కూల్స్ ఓపెన్.. ఒక్కో గదిలో 20 మందే!

బ్రాహ్ముణులను కించపరిచిందని.. యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు..